ప్రైవేట్ బ‌స్సుల‌కు ప్ర‌తినెల కోట్లు చెల్లింపులు..

Share On

ఆర్టీసీ అంటేనే ప్ర‌జా ర‌వాణా.. ప్ర‌జ‌ల కొర‌కు ప‌నిచేసే ఒక నిరంత‌ర సాధ‌నం.. అలాంటిది ప్రైవేట్ బ‌స్సుల మోజులో పడి ప్ర‌తి నెల కోట్ల రూపాయ‌ల‌ను చెల్లిస్తున్నారు.. ఒక్క నెల చెల్లించే కోట్ల రూపాయ‌ల‌తో ఆర్టీసీ వంద‌ల స్వంత బ‌స్సుల‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు. కొనుగోలు చేసిన బ‌స్సుల‌తో మ‌రికొంత‌మంది నిరుద్యోగుల‌కు ఉపాధి క‌ల్పించ‌వ‌చ్చు. కాని ఆర్టీసీ యాజ‌మాన్యం అలా ఆలోచించ‌కుండా కోట్ల రూపాయ‌ల‌ను ప్రైవేట్ బ‌స్సుల‌కే చెల్లిస్తోంది.

యూత్ ఫ‌ర్ యాంటీ క‌ర‌ప్ష‌న్ సంస్థ తెలంగాణ ఆర్టీసీలో ఎన్ని ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ బ‌స్సులు ఉన్నాయి. ప్రైవేట్ బ‌స్సుల‌కు ప్ర‌తి నెల ఒక్కో బ‌స్సుకు ఎంత చెల్లిస్తున్నారు. 2021 జ‌న‌వ‌రి నుంచి 2021 జూన్ వ‌ర‌కు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ బ‌స్సుల‌కు ఎన్ని డ‌బ్బులు చెల్లించారో స‌మాచార హ‌క్కు చ‌ట్టం కింద ఇవ్వాల‌ని ఆర్టీసీ బ‌స్సు భ‌వ‌న్‌లో ద‌ర‌ఖాస్తు చేశారు. దానికి స్పందించిన ఆర్టీసీ యజ‌మాన్యం మొత్తం తెలంగాణ‌లో ఆర్టీసీకి 9705 బ‌స్సులు ఉన్నాయ‌ని, అందులో ప్ర‌భుత్వ బ‌స్సులు 6578 కాగా, కాంట్రాక్టు ప‌ద్ద‌తిన న‌డిచే ప్రైవేట్ బ‌స్సులు 3127 ఉన్నాయ‌ని తెలిపింది.

2021 జ‌న‌వ‌రిలో 6898.44.. ల‌క్ష‌లు
2021 పిబ్ర‌వ‌రిలో 7243.12.. ల‌క్ష‌లు
2021 మార్చిలో 9906.14.. ల‌క్ష‌లు
2021 ఏప్రిల్‌లో 6930.97.. ల‌క్ష‌లు
2021 మేలో 1611.66 ల‌క్ష‌లు చెల్లించాల‌ని, ఇంకా జూన్ చెల్లింపులు పూర్తి కాలేద‌ని స‌మాచారం ఇచ్చార‌ని యూత్ ఫ‌ర్ యాంటీ క‌ర‌ప్ష‌న్ పౌండ‌ర్ రాజేంద్ర ప‌ల్నాటి తెలిపారు. ప్ర‌తి నెల అన్ని కోట్లు చెల్లిస్తున్న ఆర్టీసీ య‌జ‌మాన్యం ప‌ర్మినెంట్‌గా ప్ర‌భుత్వ బ‌స్సులు కొనుగోలు చేయాల‌నే ఆలోచ‌న ఎందుకు చేయ‌డం లేదో అర్థం కావ‌డం లేద‌న్నారు. దీనిపై ప్ర‌భుత్వం ప్రత్యేక శ్ర‌ద్ధ వ‌హించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *