శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం..

Share On

శ్రీకాకుళం జిల్లా ప‌లాస మండ‌లం సుమ్మాదేవి జాతీయ ర‌హ‌దారిపై ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో న‌లుగురు పోలీసులు మృతి చెంద‌గా, ప‌లువురు గాయ‌ప‌డ్డారు. భైరిసారంగపురంలో ఒక‌ జవాను మృతదేహం అప్పగించి ఏఆర్‌ కానిస్టేబుళ్లు బొలెరో వాహనంలో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రహదారిని క్రాస్‌ చేస్తుండగా వీరి వాహనాన్ని లారీ ఢీకొంది. ఈ ఘటనలో నలుగురు కానిస్టేబుళ్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో పోలీసుల వాహనం నుజ్జునుజ్జయింది. సమాచారం తెలుసుకున్న ఉన్నతాధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ ఘోర రోడ్డు ప్ర‌మాదంలో ఏఆర్‌ ఎస్సై కె.కృష్ణుడు, వై. బాబూరావు (HC), పి. ఆంటోనీ (HC), పి. జనార్దనరావు (డ్రైవర్‌) ప్రాణాలు కొల్పోయారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *