పెద్ద‌కుమారుడు కోటిన్న‌ర అప్పులు చేసి పారిపోయాడు..

Share On

ఒక వ్య‌క్తి ఇష్టానుసారంగా అప్పులు చేసి.. చేసిన అప్పుల‌ను తీర్చాల‌నే క‌నీస బాధ్య‌త లేకుండా ఇష్టానుసారంగా తిర‌గ‌సాగాడు.. అప్పులు వాళ్లు ఇంటికి వ‌చ్చి గొడ‌వ‌లు పెట్టేస‌రికి ఇంట్లో ఉన్న భార్య‌ను తీసుకొని చెప్పాపెట్ట‌కుండా అడ్ర‌స్ లేకుండా ఎక్క‌డికో వెళ్లిపోయాడు. దాంతో అప్పు ఇచ్చిన వ్యక్తులు వ‌చ్చి అప్పులు తీర్చాలని త‌ల్లితండ్రితో పాటు మరో కుమారుడిని నిలదీశాడు. కొందరు పరుష పదజాలం ఉపయోగించారు. అవమానం, బాధ, తలకు మించిన అప్పు తీర్చలేని నిస్సహాయత ఆ ముగ్గురిని మానసికంగా కుంగదీసింది. ఇక తమకు చావే గతి అనుకున్న వాళ్లు.. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.

ఈ విషాద సంఘ‌ట‌న చిత్తూరు జిల్లాలో జ‌రిగింది. పుత్తూరు మునిసిపాలిటీ పరిధిలో ఒకే కుటంబానికి చెందిన ముగ్గురు సామూహిక బలవన్మరణానికి పాల్పడ్డారు. మునిసిపాలిటీ పరిధిలోని రాజుపాలెంలో ఈ విషాదం జరిగింది. అప్పుల బాధతో ఆత్మ‌హ‌త్య చేసుకున్న వారిని శంకరయ్య(55), గురవమ్మ(45), వినయ్‌(25)గా పోలీసులు గుర్తించారు. పెద్ద కుమారుడు సతీష్..తెలిసిన అందరి దగ్గర అప్పులు తీసుకున్నాడు. ఆ అప్పు సుమారు రూ. కోటిన్నర అయ్యింది.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *