ఇదో ర‌కం మోసం.. ఫిట్స్ వ‌చ్చిన‌ట్లు కింద‌ప‌డిపోతారు..

Share On

అవ‌కాశాన్ని ఆస‌రాగా తీసుకొని కొత్త కొత్త ప‌ద్ద‌తుల‌తో మోసం చేసే వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూ ఉంది. ఇప్ప‌డు మ‌రో ర‌కం మోసంతో జ‌నాల‌ను తీసుకుంటున్న సంఘ‌ట‌న గుంటూరు జిల్లాలో జ‌రిగింది.

గుంటూరు జిల్లా పెదకాకానిలో కేటుగాళ్లు నయాదందాలతో రెచ్చిపోతున్నారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. పెదకాకాని సెంటర్‌లో రోడ్డు పక్కనే జనాలు ఉన్న ప్రదేశంలో వారు చూస్తూ ఉండగానే ఒక‌ వ్యక్తి ఫిట్స్‌ వచ్చిన వాడిలా కిందపడి కొట్టుకోసాగాడు. అయ్యో, పాపం అని జాలి చూపి అతనిని పైకి లేపేందుకు ఒకరు, అతని చేతిలో తాళాలు పెట్టాలని మరొకరు అక్కడికి చేరుకున్నారు. వారితో పాటే, కింద పడిన వ్యక్తిని అనుసరిస్తూ వచ్చిన వ్యక్తి కూడా అక్కడికి చేరుకుని సహాయం చేస్తున్నట్లు వారిలో కలిశాడు. కొద్దిసేపటికి ఫిట్స్‌ వచ్చి పడిపోయిన వాడిలా నటించిన వ్యక్తి కోలుకున్నాడు. అతడి అనుచరుడు మాత్రం అక్కడి నుంచి జంప్ అయ్యాడు. కొద్దిసేపటి తరువాత చూసుకుంటే అప్పటికే జేబులో లేదా హడావిడిగా పక్కన పెట్టిన ఫోన్‌ కనిపించకుండా పోయింది. పెదకాకాని సెంటర్‌లో ఇదే తరహాలో కోటేశ్వరరావు అనే వ్యక్తి ఫోన్‌ మాయమైంది. అలాగే, సాయం చేసేందుకు ముందుకొచ్చిన బోయపాటి రామ్మోహన్‌ మొబైల్‌ను సైతం సుందరయ్య కాలనీ వద్ద కాజేశారు. ఇలాంటి మోసాలకు పాల్పడే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని స్థానికులు కోరుతున్నారు. జరిగిన సంఘటనపై పెదకాకాని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు స్థానికులు వెల్లడించారు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *