వివాహానికి వెళ్లి వ‌స్తుండ‌గా మ‌హిళ‌పై సామూహిక అత్యాచారం..

Share On

భార్య‌భ‌ర్త‌లు ఇరువురూ వివాహానికి వెళ్లి బైక్‌పై వ‌స్తుండ‌గా కొంద‌రు దుండ‌గులు అడ్డ‌గించి భ‌ర్త‌పై దాడి చేసి భార్య‌ను స‌మీపంలోని పొలాల్లోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. ఈ దారుణ సంఘ‌ట‌న గుంటూరు జిల్లాలో జ‌రిగింది.

గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలానికి చెందిన దంపతులు బుధ‌వారం రాత్రి గుంటూరు నగరంలో ఒక‌ వివాహానికి హాజరై బైక్‌పై వస్తున్నారు. మేడికొండూరు అడ్డురోడ్డు సమీపంలో భ‌ర్త‌పై దాడిచేసి భార్య‌పై సామూహిక అత్యాచారం జ‌రిపారు. దీనిపై బాధితులు అర్ధరాత్రి సత్తెనపల్లి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా.. ఫిర్యాదు తీసుకునేందుకు అక్కడి పోలీసులు నిరాకరించారు. ఘటన జరిగిన ప్రదేశం గుంటూరు అర్బన్‌ ఎస్పీ పరిధిలోకి వస్తుందని.. తమ పోలీస్‌స్టేషన్‌ గుంటూరు రూరల్‌ పరిధిలో ఉంటుందని తెలిపారు. దీంతో బాధితులు వెనుదిరిగారు. ఘటన ఎక్కడ జరిగినా జీరో ఎఫ్ఐఆర్‌ నమోదు చేసి కేసును సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేయాలంటూ ఉన్నతాధికారుల ఆదేశాలు ఉన్నప్పటికీ సత్తెనపల్లి పోలీసులు ఫిర్యాదు తీసుకోవడానికి నిరాకరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *