ప్ర‌ముఖ న‌టుడు ఉత్తేజ్ ఇంట విషాదం..

Share On

ప్ర‌ముఖ సినీ న‌టుడు ఉత్తేజ్ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఉత్తేజ్ స‌తీమ‌ణి పద్మావతి కన్నుమూశారు. కొంతకాలం నుంచి అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్న ఆమె బసవతారకం క్యాన్సర్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఉత్తేజ్‌ చేసే సేవా కార్యక్రమాల్లో పద్మావతి భాగస్వామి అయ్యేవారు. ఉత్తేజ్‌కు చెందిన మయూఖ టాకీస్‌ ఫిల్మ్‌ యాక్టింగ్‌ స్కూల్‌ నిర్వహణలో ఆమె విధులు నిర్వర్తించేవారు. భార్య ఆకస్మిక మరణంతో ఉత్తేజ్‌, ఇతర కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి, ప్రకాశ్‌రాజ్‌, జీవిత రాజశేఖర్‌ ఆస్పత్రికి చేరుకుని ఉత్తేజ్‌ని పరామర్శించారు. ఆమె మరణం పట్ల సంతాపం ప్రకటించారు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version