బర్రెపై వ‌చ్చి నామినేష‌న్ వ‌చ్చిన పంచాయితీ ఎన్నిక‌ల అభ్య‌ర్థి

Share On

ఎన్నిక‌లలో పోటీచేసే కొంత‌మంది వింత వింత ప‌ద్ద‌తులు అవ‌లంభిస్తారు.. బీహర్‌లో జ‌రుగుతున్న‌ పంచాయితీ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్న‌ ఆజాద్‌ ఆలం అనే వ్యక్తి సోమవారం బ‌ర్రెపై ఎక్కి వ‌చ్చి నామినేషన్‌ వేశాడు. దీనికి సంబంధించిన ఒక‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నది. బర్రెపై రాజసంగా ఆజాద్ ఆలం కూర్చోగా.. మద్దతుదారులు పెద్ద సంఖ్యలో ఆయనను ఫాలో అయ్యారు. వీడియోలో ఆలం బర్రెపై కర్ర పట్టుకుని కూర్చోగా.. మరో వ్యక్తి ఆ బర్రెకు దారి చూపిస్తున్నాడు. ఈ పెద్దాయన కతిహార్‌ జిల్లాలోని రాంపూర్‌ పంచాయతీ నుంచి ఎన్నికల బరిలో ఉన్నారు. ‘నేను పశువుల కాపరిని. పెట్రోల్ పోసుకుని బండిలో రావడానికి నా వద్ద అంత డబ్బులు లేవని అత‌ను అంటున్నాడు..

ఎన్విరాన్‌మెంట్‌ ఫ్రెండ్లీ క్యాండిడేట్‌ అని నెటిజెన్‌ కామెంట్‌ చేయగా.. కాలుష్యాన్ని నివారించేందుకు ఇలాంటి విధానాన్ని ఎంచుకున్న ఈయనను మనమంతా అభినందించాల్సిందే అని మరో నెటిజెన్‌ రాశారు. ఇప్పటివరకు యమదూతలు మాత్రమే వచ్చేవారని విన్నాం.. కానీ ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్‌ వేయడానికి కూడా బర్రె ఉపయోగపడుతుందని చెప్తున్న ఈయన నిజమైన హీరో అని ఇంకొక నెటిజెన్‌ ఆకాశానికెత్తేశారు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *