
మీరు ఎమ్మెల్యెగా పోటీ చేయాలనుకుంటున్నారా.. మీకు ఎమ్మెల్యె టికెట్ కావాలా.. ఐతే కొన్ని పద్దతులు పాటించాలంటే ఉత్తరప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ కొన్ని నియమాలను విడుదల చేసింది. ఎవరెవరు ఎక్కడ నుంచి దరఖాస్తు చేయాలనుకుంటున్నారో తెలుపుతూ 11 వేలు ఇవ్వాలని.. ఆ మొత్తాన్ని ఆర్టీజీఎస్ ద్వారా బ్యాంక్ అకౌంట్‌కు పంపిస్తే.. అప్పుడే మీ అప్లికేషన్‌ను పరిశీలిస్తామని కాంగ్రెస్ పార్టీ తెలిపింది.
ఉత్తరప్రదేశ్‌లో వచ్చే సంవత్సరం ప్రథమార్థంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎవరితో పొత్తు పెట్టుకోకుండా సొంతంగానే బరిలోకి దిగాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. మొత్తం 403 స్థానాల్లో తమ అభ్యర్థులను పోటీలో నిలపనుంది. దీనికోసం కార్యాచరణ ప్రారంభించింది. ఇదులో భాగంగా ఎమ్మెల్యే టికెట్ కావాలనుకున్న దరఖాస్తు చేసుకోవాలని పార్టీ రాష్ట అధ్యక్షుడు అజయ్ కుమార్ లల్లూ ఆశావహులకు సూచించారు. అయితే దరఖాస్తుతో పాటు రూ.11 వేలు బ్యాంకులో జమచేయాలని షరతు విధించారు. ఈనెల 25వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించారు. ఈ మేరకు ఒక లేఖను విడుదల చేశారు.