అత‌ను పేరుకే ఉపాధ్యాయుడు.. చేసేవ‌న్నీ చీక‌టి దందాలే..

Share On

ఉపాధ్యాయుడి వృత్తిని మించిన ప‌విత్ర‌మైన‌ది మ‌రోటి ఎక్క‌డ లేదు.. కాని ఒక వ్య‌క్తి మాత్రం ఉపాధ్యాయ పేరును అడ్డం పెట్టుకొని చీక‌టి దందాను న‌డిపిస్తున్నాడు.. ఉపాధ్యాయ ముసుగులో దాడులు, అత్యాచారాలకు పాల్పడుతున్నాడ‌నే ప‌క్కా స‌మాచారంతో పోలీసులు వ‌ల‌ప‌న్ని ప‌ట్టుకున్నారు.. చిత్తూరు జిల్లా పోలీసులు పక్కా పథకం ప్రకారం దాడి చేసి అతని స్థావరాన్ని పెకిలించి వేశారు. మద్యం డంప్‌పై మెరుపు దాడి చేశారు. చెన్నై, బెంగళూరు జాతీయ రహదారుల మధ్యలో రెడ్డిగుంట జంక్షన్ వద్ద రహస్యంగా దాచి ఉంచిన మద్యం డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న ఇద్దరు లిక్కర్ స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. మరో స్మగ్లర్ తప్పించుకోగా.. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

చెన్నై, బెంగళూరు జాతీయ రహదారుల మధ్యలో రెడ్డిగుంట జంక్షన్ వద్ద రహస్యంగా దాచి ఉంచిన మద్యం డంప్‌పై చిత్తూరు పోలీసులు మెరుపు దాడి చేశారు. చెన్నై- బెంగళూరు జాతీయ రహదారి వెంట, చిత్తూరు శివారు ప్రాంతంలోని లక్ష్మయ్య కండ్రి గ్రామంలో డంప్‌ను గుర్తించారు. ఈ దాడుల్లో 21 లక్షల రూపాయల విలువైన 680 మద్యం బాటిల్లతో పాటు రెండు కార్లను కూడా పోలీసులు సీజ్ చేసారు. ఈ వ్యవహారంలో సోమల మండలానికి చెందిన చంద్రమౌళి, గంగాధర నెల్లూరు మండలానికి చెందిన తులసీరామ్‌ను పోలీసులు రెడ్ హ్యాండెట్‌గా పట్టుకున్నారు. అయితే, ఇందులో ప్రధాన నిందితుడైన చంద్రమౌళిపై గంగవరం, సోమల మండలాల్లో పలు కేసులు ఉన్నాయి. ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న చంద్రమౌళిపై అనేక ఆరోపణలు ఉన్నాయి. చంద్రమౌళి అత్యాచారాలు, దాడులు, చీటింగ్‌లకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఇక మరో నిందితుడు బైరెడ్డిపల్లికి చెందిన పురుషోత్తం పరారయ్యాడని పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను చిత్తూరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ చీకటి సామ్రాజ్యాన్ని నడిపిస్తున్న చంద్రమైళిని ఎట్టకేలకు అరెస్టు చేసినట్లు వెల్లడించారు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *