ఆ న‌లుగురు ఆడ‌బిడ్డ‌లు.. ఆస్తిని తీసుకొని త‌ల్లిని..

Share On

కొడుకులు త‌ల్లిదండ్రుల ఆస్తి తీసుకొని దూరం పెట్ట‌డం.. వారిని ఇబ్బందులు పెట్ట‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.. కాని ఇక్క‌డ ఆవిడ క‌డుపున పుట్టిన న‌లుగురు ఆడ‌పిల్ల‌లు ఆ త‌ల్లి ఆస్తి తీసుకొని ఆవిడ‌ను న‌డిరోడ్డులో వ‌దిలేశారు. ఈ దారుణ సంఘ‌ట‌న క‌ర్నూలు జిల్లాలో జ‌రిగింది.. దీంతో ఆ అమ్మ న్యాయం కోసం అధికారులను ఆశ్రయించింది.

క‌ర్నూల్ జిల్లాలోని బనగానపల్లె మండలం యనగండ్ల గ్రామానికి చెందిన 90 ఏళ్ల వృద్ధురాలు బాలనాగమ్మ తన నలుగురు కుమార్తెలపై కలెక్టర్ కు ఫిర్యాదు చేసింది. బాలనాగమ్మకు నలుగురు కుమార్తెలు.. గతంలోనే తల్లికి ఉన్న 50 ఎకరాల భూమిలో 40 ఎకరాల భూమిని ఇప్పటికే వారి పేరుతో రాయించుకున్నారు. అయితే అప్పటి నుంచి తల్లిని పట్టుకోవడం మానేశారు. అంతేకాదు మిగిలిన 10 ఎకరాలను కూడా తమ పేరుతో రాయమని అమ్మపై ఒత్తిడి తీసుకొచ్చారు. వృద్ధిరాలిపై నలుగురు కుమార్తెలు తమ దాష్టీకం ప్రదర్శిస్తూ.. ఇబ్బందులకు గురు చేస్తున్నారు. దీంతో బాలనాగమ్మ జిల్లా కలెక్టర్ కు తన కుమార్తెలు కేవలం తన ఆస్తి కావాలనే ఒత్తిడి చేస్తున్నారని తన పోషణను మాత్రం పట్టించుకోవడంలేదని ఫిర్యాదు చేసింది. దీంతో ఈ కేసుని మానవ హక్కుల కమిషన్ కార్యాలయం సుమోటోగా స్వీకరించింది. ఈ కేసుని వెంటనే విచారించి నివేదిక సమర్పించాలని మానవహక్కుల కమిషన్‌కు కర్నూలు ఆర్డీవో హరి ప్రసాద్‌ను ఆదేశించింది.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *