సారీ మేడం.. చీర క‌ట్టుకున్న వారికి ఈ హోట‌ల్‌లో అనుమ‌తి లేదంటూ..

Share On

ప్ర‌పంచంలోనే ఎన్నో దేశాలు సంస్కృతి, సంప్ర‌దాయాల కోసం భార‌త‌దేశం వైపు చూస్తారు.. ఇక్క‌డి ఆచార‌, సంప్ర‌దాయాలు చాలా గొప్ప‌వ‌ని పొగడుతూ వాటిని ఆచ‌రించేందుకు ప్ర‌య‌త్నం చేస్తారు.. భార‌తీయ మ‌హిళ‌ల చీర‌క‌ట్టులో ఎంతో అందం దాగింద‌ని, ఎంతో హుందాగా ఉంటారని చెపుతూ, చీర‌క‌ట్టుకునేందుకు తాప‌త్రయ ప‌డే విదేశీ మ‌హిళ‌లు ఉన్నారు.. అలాంటిది మ‌న దేశ రాజ‌ధాని ఢిల్లీలోని ఒక రెస్టారెంట్‌లో ఎంతో గొప్ప‌దైన భార‌తీయ సంస్కృతిని కించ‌ప‌రిచేలా ఒక సంఘ‌ట‌న జ‌రిగింది.

ఢిల్లీలోని అక్విలా రెస్టారెంట్‌లోకి ఒక మ‌హిళ చాలా అందంగా చీర‌క‌ట్టుకొని వెళ్ల‌బోతుండగా అక్క‌డ ఉన్న మ‌హిళా సిబ్బందియే ఆ మ‌హిళ‌ను అడ్డుకున్నారు. త‌న‌ను ఎందుకు అడ్డుకుంటున్నార‌ని స‌ద‌రు మ‌హిళ అడ‌గ‌గా ఈ హోట‌ల్‌లో క్యాజువ‌ల్స్‌కు మాత్ర‌మే అనుమ‌తి ఉంద‌ని అక్క‌డి సిబ్బంది స‌మాధానం చెప్పింది. స్మార్ట్ క్యాజువ‌ల్ అంటే ఏంట‌ని ఆ మ‌హిళ అడ‌గ‌గా.. జీన్స్ టీష‌ర్ట్స్‌, స్క‌ర్ట్స్‌, మిడ్డీస్ వంటి దుస్తుల‌ని ఒక జాబితానే చెప్పింది. చీర మాత్రం ఆ లిస్టులో లేద‌ని తెలిపింది. మీరు క‌ట్టుకున్న చీర క్యాజువ‌ల్‌గా లెక్క‌లోకి రాద‌ని ఆ మ‌హిళ‌ను లోప‌లికి అనుమ‌తించ‌కుండా బ‌య‌టి నుంచి బ‌య‌టికే పంపారు హోట‌ల్ సిబ్బంది. హోట‌ల్ సిబ్బంది ప్ర‌వ‌ర్తించిన తీరుపై ఆ మ‌హిళ త‌న ఆవేద‌న‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకోవ‌డంతో నెటిజ‌న్లు ఆ హోట‌ల్ య‌జ‌మాన్యంపై మండిప‌డుతూ, మ‌న దేశంలో మ‌న సంస్కృతిని కించ‌ప‌రిచేలా ప్ర‌వ‌ర్తించిన ఆ హోట‌ల్‌పై చ‌ర్య‌లు తీసుకొవాల‌ని అంటున్నారు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *