న‌రేంద్ర‌మోడీ అమెరికా ప‌ర్య‌ట‌న వెనుకున్న మ‌త‌ల‌బు ఏంటీ..

Share On

దేవేంద‌ర్ కొన్నె.. ముంద‌డుగు ప్ర‌త్యేక ప్ర‌తినిధి. హైద‌రాబాద్‌

భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఐదు రోజుల ప‌ర్య‌ట‌న కోసం అమెరికా వెళ్లారు.. అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాల నేతలు పాల్గొనే క్వాడ్ సదస్సులో మోదీ పాల్గొంటారు. ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీలో ప్రసంగిస్తారు. జో బైడెన్ అధ్యక్షుడైన తర్వాత ఇరు దేశాల నేతల మధ్య సమావేశం జరగడం ఇదే మొదటిసారి. అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌తో కూడా మోదీ సమావేశమవుతారు, కోవిడ్ సమయంలో ప్రధాని చేస్తున్న రెండో విదేశీ పర్యటన ఇది. ఈ ఏడాది మార్చిలో ఆయన బంగ్లాదేశ్‌లో పర్యటించారు. అమెరికా పర్యటనలో ప్రధాని మోదీ పలు దేశాల నేతలతో సమావేశం కాబోతున్నారు. ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకోవడంలో భాగంగా ఈ నెల 24న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో మోదీ చర్చలు జరుపుతారు.

రెండు దేశాల మధ్య సంబంధాలే ప్రధాన అజెండా అయినప్పటికీ, మోదీ, బైడెన్‌ల మధ్య సమావేశంలో అఫ్గానిస్తాన్ వ్యవహారాలు కూడా ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. అయితే, సైన్యాల ఉపసంహరణ తర్వాత అఫ్గానిస్తాన్‌ విషయాన్ని వదిలేయాలని అటు అమెరికా ప్రజలు, ఇటు ఆ దేశ నాయకత్వం భావిస్తున్నట్లు విదేశాంగ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు నేతల మధ్య సమావేశం ఆసక్తికరంగా మారింది. 50 నిమిషాలపాటు సాగే ఈ చర్చల్లో బహుముఖ ద్వైపాక్షిక సంబంధాల గురించి ఇరువురు నాయకులు సమీక్షిస్తారని అంచనా.. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రతా సహకారాలను బలోపేతం చేయడంతోపాటు అఫ్గాన్ సమస్య కూడా సెప్టెంబర్ 24 నాటి సమావేశంలో కీలకం కానుంది.
బైడెన్‌తో చర్చల సందర్భంగా అఫ్గాన్ అంశాన్ని మోదీ ప్రస్తావించే అవకాశం ఉంది ”అఫ్గానిస్తాన్‌ నుంచి బైటికి రావాలని అమెరికా ఎప్పుడో నిర్ణయించింది. ఇప్పుడు అక్కడ తాను చేయాల్సింది ఏమీ లేదని అమెరికా భావిస్తోంది. ఆ దేశం పట్టించుకోవాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి”
”ఇండియా అమెరికాలు వ్యూహాత్మకంగా స్నేహితులే. వారిద్దరి ప్రధాన ప్రత్యర్థి చైనాయే. కానీ, తప్పనిసరి పరిస్థితుల్లో అమెరికా అఫ్గానిస్తాన్ నుంచి బయటకు వచ్చింది. అందుకే భారత్ అభద్రతలో ఉంది” గల్వాన్ లోయ ఘర్షణ తర్వాత ఇండియా, చైనాల మధ్య సంబంధాలు బాగా చెడిపోయాయని, ఈ పరిస్థితుల్లో అమెరికాతో చేతులు కలపక తప్పదని ఇండియా భావిస్తున్నట్లు మరికొందరు నిపుణులు వ్యాఖ్యానించారు.
చైనాతో ముప్పు ఉందని, పరస్పర సహకారంతో ముందుకు పోవాలని ఐక్యరాజ్యసమితిలో చేసిన ప్రసంగంలో పరోక్షంగా చెప్పిన బైడెన్, దీనికి వ్యతిరేకంగా పోరాడటంలో అమెరికా ముందుంటుందని అన్నారు.

ఇటీవల జరిగిన AUKUS జలాంతర్గామి ఒప్పందం ఇందులో ఒక భాగమని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఇండియా తనవైపు ఉండటం ఇటు అమెరికాకు కూడా అవసరమే. ”ఇటీవల జరిగిన AUKUS ఒప్పందం కేవలం ప్రపంచం మీద అమెరికా ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి ఉద్దేశించిందే. అది పక్కాగా అమలు కావాలంటే ఇండియాలాంటి దేశాల తోడు అమెరికాకు బైడెన్‌తో వ్యక్తిగతంగా మంచి సంబంధాలు లేకపోయినప్పటికీ, ఆయనకు దగ్గరయ్యే అవకాశం మోదీకి ఉందని కొందరు నిపుణులు చెబుతున్నారు.
”ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో రక్షణ కోసం అమెరికా AUKUS ఒప్పందానికి సిద్ధపడింది. ఇలాంటి సమయంలో ఆసియాలో చైనాను ప్రధాన సమస్యగా చూపగలిగితే వైట్‌హౌస్‌లో మోదీ మంచి పలుకుబడి సాధించవచ్చు”. ‘అఫ్గానిస్తాన్‌లో ఓటమి తర్వాత ప్రపంచానికి పెద్దగా తన పరపతి నిలబెట్టుకోవడం ఇప్పుడు అమెరికాకు అత్యవసరం. ఈ పరిస్థితుల్లో తెలివిగా వ్యవహరిస్తే ప్రపంచ రాజకీయాల్లో ఇండియా కీలకమైన శక్తిగా ఆవిర్భవించవచ్చుస‌..


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *