నుదుటి బాసికం లేకుండా పెళ్లి జ‌రగ‌దు.. అస‌లు

Share On

భార‌తీయ సంప్ర‌దాయంలో జ‌రిగే పెళ్లికి ఒక్కో మంత్రానికి ఒక్కో అర్థం ఉంటుంది.. భార‌తీయ ఆచారంలో పెళ్లి మొద‌లైన‌ప్ప‌టి నుంచి పెళ్లి ముగిసే వ‌ర‌కు ప్ర‌తిదానికి ఒక అర్థం ఉంటుంది.. పెళ్లిలో పెద్ద‌వాళ్లు ఏం చేసినా దాని వెనుకాల ఒక అర్థం, ప‌ర‌మార్థం ఉంటుంది.. ఇప్ప‌టి త‌రానికి స‌నాత‌న భారతీయ సంస్కృతి, సాంప్రదాయంలో అనుసరించిన కొన్ని పద్దతులు తెలియాల్సిన అవ‌స‌రం ఉంది.. హిందూ సాంప్రదాయ వ్యవస్థలో పెళ్లికి చాలా ప్రాముఖ్యత ఉంది. పెళ్లిలో భాగంగా రకరకాల కార్యక్రమాలు ఉంటాయి. ముఖ్యంగా హిందూ వివాహ పద్దతిలో వధూవరులకు నుదుట బాసికం కడతారు. దీని వెనుక ఆధ్యాత్మికంగానే కాదు, శాస్త్రీయంగానూ లాభాలు ఉన్నాయి.

మానవ శరీరంలో మొత్తం 72 వేల నాడులు ఉంటాయి.. అందులో 14 నాడులు ఎంతో ముఖ్యమైనవి. వీటి వల్ల మానవ శరీరం ఎల్లప్పుడూ ఉత్తేజంగా ఉంటుంది. ఈ 14 నాడుల్లో ఇడ, పింగళ, సుషుమ్మ అనేవి అతి ముఖ్యమైనవి. సుషుమ్న నాడికి కుడి పక్కన సూర్యనాడి, ఎడమ పక్కన చంద్రనాడి ఉంటాయి. ఈ రెండూ నుదుట భాగంలో కలుసుకుంటాయి. ఈ నాడుల కలయిక అర్థచంద్రాకారంలో ఉంటుంది. వేదకాలంలో ఈ భాగాన్ని రుషులు దివ్యచక్షువు అని పిలిచేవారు. వివాహసమయంలో దీనిపై ఇతరుల దృష్టి సోకకుండా బాసికాన్ని కడతారు. అంతేకాదు ఎలాంటి ప్రమాదాలు, కష్టాలు రావని నమ్ముతారు. బాసికం అర్ధచంద్రాకారం, త్రిభుజాకారం, చతురస్త్రాకారంలో ఉంటుంది. నుదుట భాగాన బ్రహ్మ కొలువుంటాని హిందువులు ప్రగాఢ నమ్మకం. అలాంటి భ్రూమధ్య స్థానంలో కొలువున్న బ్రహ్మ, మానవుడి భవిష్యత్తుకు సంబంధించిన అన్ని విషయాలను ఇక్కడే పొందుపరుస్తాడు. నెత్తిన చేతులు వేసుకోవడం అరిష్టమని, తరచూ నుదుట భాగాన్ని చేతితో రుద్దకూడదని పెద్దలు అంటారు.

ఏంతో పవిత్రమైన ఈ ప్రదేశంపై ఇతరుల దృష్టి సోకడం కూడా మంచిది కాదు. అందుకే పూర్వకాలం నుంచి బాసికం ధరించడం ఆచారంగా వస్తోంది. సాధారణంగా వివాహ సమయంలో వధూవరులను అందంగా అలంకరిస్తారు. వారి అలంకరణను చూసి అతిథులు, బంధువులు ముగ్దులవుతారు. అలా అందరూ చూసేటప్పుడు వారిపై కనుదృష్టి పడుతుంది. ఇటువంటి వాటి నుంచి రక్షణ పొందడానికే బ్రహ్మ కొలువున్న ఈ స్థానంలో బాసికాన్ని కడతారు. దీని వల్ల భార్యభర్తల మధ్య బంధం మరింత బాగా బలపడుతుందని ప‌లు శాస్త్రాలు చెపుతున్నాయి..


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *