దుర్మార్గుడు.. పింఛ‌న్ డ‌బ్బుల కోసం ఎంత ప‌నిచేశాడంటే..

Share On

మ‌ద్యం తాగుతే, మ‌ద్యానికి అల‌వాటుప‌డితే ఆ మ‌త్తులో ఏం చేస్తారో.. ఏలాంటి దారుణాల‌కు పాల్ప‌డుతారో అర్థం కాని ప‌రిస్థితి.. ఒక వ్య‌క్తి తాగుడుకు బానిస‌గా మారి క‌న్న త‌ల్లిని అత్యంత కిరాత‌కంగా చంపేశాడు. ఈ దారుణ సంఘ‌ట‌న వికారాబాద్ జిల్లాలో జ‌రిగింది.

వికారాబాద్ జిల్లా పరిగి మండలం ఖుదావాన్​పూర్​కు చెందిన బలవంత్ తన తల్లి భీమమ్మ(62)ను విద్యుత్ తీగతో గొంతు నులిమి హతమార్చాడు. కొన్నేళ్లుగా మద్యానికి బానిసైన బలవంత్​ విచక్షణ కోల్పోయి, పిచ్చిపిచ్చిగా ప్రవర్తించేవాడని గ్రామస్థులు తెలిపారు. పెళ్లి చేస్తే అయినా బాగుపడతాడని తల్లి పెళ్లి చేసిందని.. కానీ తాగి వచ్చి భార్యను వేధించడంతో ఆమె తన ఇద్దరు పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లినట్లు వెల్లడించారు. తర్వాత తల్లితో ఉంటున్న బలవంత్.. రైతు బంధు, పింఛను డబ్బు కోసం ఆమెను నిత్యం వేధించేవాడని చెప్పారు. శుక్రవారం రోజున భీమమ్మకు రూ.2వేలు పెన్షన్ డబ్బు రావడంతో ఆమె నుంచి వేయి రూపాయలు లాక్కున్నాడని.. మిగతా వేయి రూపాయల కోసం రాత్రి హత్య చేసి ఉంటాడని స్థానికులు అనుమానిస్తున్నారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని.. నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. స్థానికులను ఆరా తీయగా.. పెన్షన్ డబ్బు కోసమే నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టాడని చెప్పారని తెలిపారు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *