15ఏళ్ల బాలిక అత్యాచార బాధితురాలు.. ఆడ‌పిల్ల‌కు జ‌న్మ‌నిచ్చింది..

Share On

ఇద్ద‌రు యువ‌కులు 15ఏళ్ల బాలిక‌పై అత్యాచారం చేశారు.. ఆ బాలిక గ‌ర్బం దాల్చి ఒక ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది.. దీనికి బాధ్యులెవ‌రిని త‌ల్లిదండ్రులు నిల‌దీయడంతో త‌న‌పై అత్యాచారానికి పాల్ప‌డిన ఇద్ద‌రి యువ‌కుల పేర్ల‌ను చెప్పింది. దాంతో ఆ కుటుంబ‌స‌భ్యులు ఇద్ద‌రు యువ‌కుల‌కు పిలిపించి పంచాయితీ పెట్టారు. నిందితులిద్ద‌రూ.. బాధితురాలు బిడ్డ‌కు జ‌న్మనిచ్చిన త‌ర్వాత ఆ బిడ్డ‌ను ఎక్క‌డైనా వ‌దిలేసే బాధ్య‌త త‌మ‌ద‌ని ఒప్పుకున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా బాధితురాలు ఆడ‌పిల్ల‌కు జ‌న్మనిచ్చింది. ముందు చేసుకున్న ఒప్పందం ప్ర‌కారం.. నిందితులు బాధితురాలి బిడ్డ‌ను ముంబైకి చెందిన దంప‌తులకు ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. ఈ దారుణ సంఘ‌ట‌న మ‌హారాష్ట్ర‌లోని స‌తారా జిల్లాలో జ‌రిగింది.

ఆల‌స్యంగా ఈ విష‌యం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. బాలికపై అత్యాచారానికి పాల్ప‌డ‌ట‌మేగాక, ఆమె క‌న్న‌బిడ్డ‌ను చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన ప్ర‌క్రియ‌ను పాటించ‌కుండా ఇత‌రుల‌కు ఇచ్చే ప్ర‌య‌త్నం చేసిన నిందితులిద్ద‌రిని అరెస్ట్ చేశారు. అదేవిధంగా ఈ ఘ‌ట‌న‌లో ప్ర‌మేయం ఉన్న మ‌రో 11 మందిపై కేసులు న‌మోదుచేశారు. వారిలో అత్యాచార బాధితురాలి కుటుంబానికి చెందిన ఒక స‌భ్యుడు కూడా ఉన్నారు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *