మ‌హిళ కానిస్టేబుల్‌పై సామూహిక అత్యాచారం..

Share On

పుట్టిన‌రోజు అని చెప్పి ఒక మ‌హిళ కానిస్టేబుల్‌ను ఇంటికి ఆహ్వానించారు.. స్నేహితులే క‌దా అని న‌మ్మి వ‌చ్చిన మ‌హిళా కానిస్టేబుల్‌పై ముగ్గురు దుర్మార్గులు సామూహిక అత్యాచారం జ‌రిపారు. అంతేకాకుండా సదరు అత్యాచారాన్ని వీడియో తీసి బెదిరించారు. మూడు వారాల క్రితమే ఘటన జరుగగా మహిళా కానిస్టేబుల్ అయిన బాధితురాలు ఆలస్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సీముచ్ జిల్లాలో బాధితురాలైన 30 ఏళ్ల మహిళ కానిస్టేబుల్‌గా పనిచేస్తోంది. ప్రధాన నిందితుడు గత ఏప్రిల్‌లో సోషల్ మీడియాలో పరిచయం అయ్యాడు. తరచూ మెసేజీలు పెట్టి మహిళా కానిస్టేబుల్‌కు మరింత దగ్గరయ్యాడు. తనతో చనువు పెరగడంతో తరచూ ఛాటింగ్ చేస్తూ మూడు వారాల క్రితం తన సోదరుడి పుట్టిన రోజు వేడుకకు రావాలని ఆహ్వానించాడు. నీముచ్ జిల్లా నుంచి ఇండోర్ జిల్లాకు బదిలీపై వెళ్లింది. అయినప్పటికీ తనతో సోషల్ మీడియా ద్వారా పరిచయం కొనసాగిస్తున్న వ్యక్తి చాలా హుందాగా ఆహ్వానించడంతో ఏమాత్రం అనుమానించకుండా పుట్టిన రోజు వేడుకకు వెళ్లింది. అయితే అక్కడకు వెళ్లిన బాధితురాలిని కామాంధుడు చెరబట్టాడు. తనతోపాటు మరో ఇద్దరు స్నేహితులతో కలసి సామూహిక అత్యాచారం జరిపారు. అంతేకాదు మొత్తం ఘటనను వీడియో తీసి మహిళా కానిస్టేబుల్ ను బెదిరించారు. దీంతో ఆమె ఎవరికీ చెప్పుకోలేక తీవ్రంగా బాధపడింది. వీడియో వారి చేతిలో ఉండడంతో పరువుపోతుందేమోనని బాధితురాలు మిన్నకుండిపోగా.. వారి బంధువు ఒకరు డబ్బులు డిమాండ్ చేయడంతో సహించలేకపోయింది. ఈనెల 13న ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు ఫిర్యాదు తీసుకుని నిందితుడి కోసం వేట మొదలుపెట్టారు. సాక్షాధారాలు దొరకడంతో ప్రధాన నిందితుడు సహా అతనికి సహకరించిన తల్లిని కూడా శనివారం అరెస్టు చేశారు. మహిళా పోలీసుపైనే గ్యాంగ్ రేప్ కు పాల్పడిన ఘటన కలకలం సృష్టిస్తోంది.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *