తెలియ‌ని వైద్యం చేశారు.. ప‌సికందును చంపారు..

Share On

ఒక గ‌ర్భిణీ నొప్పుల‌తో ఒక మ‌హిళ‌ ఆసుప‌త్రికి వ‌చ్చింది.. స‌మ‌యానికి ఆసుప‌త్రిలో వైద్యుడు లేడు.. డాక్ట‌ర్ లేడ‌ని ద‌గ్గ‌ర్లో ఉన్న ఆసుప‌త్రికి తీసుకెళ్లాల‌ని చెప్పాల్సిన న‌ర్సులు తాము వైద్యం చేస్తామ‌ని ఆ గ‌ర్బిణీకి డెలివ‌రీ చేశారు. వైద్యం వికటించడంతో అప్పుడే పుట్టిన పసికందు చనిపోయింది. ఈ ఘటన మ‌హబూబ్‌న‌గ‌ర్‌ జిల్లా కేంద్రంలోని వీక్ష ఆసుపత్రిలో చోటుచేసుకుంది. కరోనా సమయంలో బాధితుల నుంచి లక్షల్లో డబ్బులు వసూల్ చేసినట్లు ఈ ఆస్పత్రిపై ఆరోపణలు కూడా ఉన్నాయి. తాజా ఘటనతో మరోసారి ఈ ఆస్పత్రి మీద చర్చ జరుగుతోంది. నర్సుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ చనిపోయిందని కుటుంబసభ్యులు ఆందోళన చేస్తున్నారు. ఆ హాస్పిటల్‌ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించడం గమనార్హం.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *