అమెరికాలో ప‌ట్టాలు త‌ప్పిన రైలు..

Share On

అగ్ర‌రాజ్యం అమెరికాలోని మెంటానాలో ఒక రైలు ప‌ట్టాలు త‌ప్పింది.. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌లో ముగ్గురు చ‌నిపోగా మ‌రో 50మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. సియాటెల్‌ నుంచి చికాగో మధ్య నడిచే రైలు.. శనివారం సాయంత్రం 4 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) జోప్లిన్ వద్ద ప్రమాదానికి గురైందని అధికారులు తెలిపారు. ఐదు బోగీలు పట్టాలు తప్పాయని, ప్రమాద సమయంలో రైలులో 147 మంది ప్రయాణికులు,13 మంది సిబ్బంది ఉన్నారని వెల్లడించారు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *