భ‌ర్త చేసిన ప‌నికి.. మ‌న‌స్తాపంతో మ‌హిళ స‌ర్పంచ్ ఆత్మ‌హ‌త్య‌..

Share On

ఆ మ‌హిళ ఒక గ్రామానికి స‌ర్పంచ్‌గా ప‌నిచేస్తోంది.. గెలిపించిన ప్ర‌జ‌ల‌కోసం ప‌నిచేయాల‌ని త‌పిస్తున్న ఆ మ‌హిళ భ‌ర్త చేసిన ప‌నికి తీవ్ర మ‌న‌స్తాపం చెంది ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఈ విషాద సంఘ‌ట‌న మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలంలో జ‌రిగింది. ఆ మ‌హిళ‌ నసురుల్లాబాద్‌ గ్రామానికి సర్పంచ్‌గా ఉన్నారు.

జడ్చర్ల సీఐ వీరస్వామి కథనం మేరకు.. జడ్చర్ల మండలం నసురుల్లాబాద్‌కు చెందిన శ్రీనివాస్‌ నాయక్‌, మాచారం తండాకు చెందిన పాల్‌త్యావత్‌ సిరి (30)కి పన్నెండేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. రెండేళ్ల క్రితం కొత్తగా ఏర్పడిన నసురుల్లాబాద్‌ తండా నుంచి 2019 జనవరి ఎన్నికల్లో సిరి ఏకగ్రీవ సర్పంచిగా ఎన్నికయ్యారు. కొద్ది నెలల కిందట శ్రీనివాస్‌ నాయక్‌ అదే తండాకు చెందిన ఒక‌ వివాహితతో వెళ్లిపోయి రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ నెల 14న ఆ మహిళతో కలిసి స్వగ్రామానికి రాగా సిరి గొడవ పడ్డారు. భర్త చేసిన మోసాన్ని తట్టుకోలేకపోయిన సిరి మనస్తాపంతో పరుగుల మందు తాగి ఆత్మహత్య యత్నించింది. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సిరి శనివారం ఉదయం మృతి చెందారు. ఆమె సోదరుడు శంకర్‌ నాయక్‌ ఫిర్యాదు మేరకు ఆత్మహత్యకు ప్రేరేపించిన భర్త శ్రీనివాస్‌ నాయక్‌పై కేసు నమోదు చేసినట్లు జడ్చర్ల పోలీసులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తామని వెల్లడించారు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *