ఆ దేశంలో పాముల‌ను మింగే ఆచారమంట‌.. ఒక వ్య‌క్తి

Share On

చాలామంది పాము చూస్తేనే వ‌ణికిపోతారు.. బ‌తికున్న పాము ఐనా, చ‌నిపోయిన పాము ఐనా భ‌యపడేవారు చాలామంది ఉంటారు.. అలాంటిది ఒక వ్య‌క్తి ప్రాణంతో ఉన్న పామును మింగేశాడు. ఇలాంటి డేంజరస్ స్టంట్ చేసిన ఆ వ్యక్తి చివరికి ప్రాణాలు విడిచాడు. రష్యా ఆస్ట్రాఖాన్‌కు చెందిన 55 ఏళ్ల వ్యవసాయ కూలీకి సంబంధించిన వీడియో ఇప్పుడు ట్రెండింగ్‌గా మారింది.

డైలీ స్టార్ వెల్లడించిన వివరాలు ప్రకారం ఆ వ్యక్తి పామును మింగటానికి రెండు సార్లు ట్రై చేశాడు. కానీ మూడవ సారి ప్రయత్నిస్తుండగా.. అతడి నాలుకకు పాము కాటు వేసింది. అప్పటికీ కూడా ఆ వ్యక్తి ఆగకుండా పామును మింగటానికి ప్రయత్నించగా, పాము గొంతు లోపల భాగంలో కూడా మరోసారి కాటువేసింది. పాముకాటు తరువాత క్రమక్రమంగా అతడి ఆరోగ్య పరిస్థితి క్షీణించటం మొదలైంది. చికిత్స కోసం అతడిని హాస్పిటల్‌లో చేర్చగా ఆ వ్యక్తికీ అలర్జీ సోకిందని వైద్యులు వెల్లడించారు. పాము కాటు కారణంగా నాలుక, గొంతు తీవ్రమైన వాపుకు గురయ్యాయి. ఆ వ్యక్తి అనాఫిలాక్టిక్ షాక్‌కు గురయ్యారని డాక్టర్లు వెల్లడించారు. అంటే బాడీలో ప్రవేశించిన యాంటిజెన్‌కు కారణంగా బాడీ హైపర్సెన్సిటివ్‌గా మారి, ప్రాణాంతకర అలెర్జీ గా మారటాన్ని అనాఫిలాక్టిక్ షాక్‌ అంటారు. దీంతో వ్యక్తి నాలుక విపరీతంగా ఉబ్బటం కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడి మరణించాడని డాక్టర్లు తెలిపారు.

డైలీ స్టార్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ ప్రాంతంలో స్థానిక ప్రజలలో పాములను మింగే సాంప్రదాయ అలవాటు ఉందట. పుచ్చకాయ పొలాలలో స్టెప్ వైపర్ అనే పాము ఆ వ్యక్తికీ తారసపడింది. ఆ పాము పెద్దగా విషపూర్తితం కానప్పటికీ, కాటేస్తే ఎంతోకొంత ప్రమాదం ఉంటుంది. ఈ సంఘటన జరిగినప్పటీ నుంచి అక్కడి నిపుణులు, సామాజిక వేత్తలు పాములను మింగే ఆచారం ఆపివేయాలని.. ఇలాంటి వాటి వల్ల ప్రాణాలకు ముప్పు ఉందని కోరుతున్నారు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *