చైనా ఫోన్ల‌ను వాడ‌కండి.. విసిరికొట్టండంటూ ఒక దేశం ఆదేశం

Share On

మ‌న దేశ ప్ర‌జ‌లు ఎవ‌రూ చైనా ఫోన్ల‌ను వాడొద్దు.. అవి వాడే వారు వెంట‌నే వాటిని విసిరికొట్టాల‌ని త‌మ దేశ ప్ర‌జ‌ల‌కు లిథుయేనియా దేశం ఆదేశాలు జారీ చేసింది. ఆ దేశ ప్ర‌భుత్వం ఇచ్చిన ఆదేశాలు ఇప్పుడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి. ముఖ్యంగా చైనాకు చెందిన షియోమీ, హువావీ స్మార్ట్‌ఫోన్ల‌ను కొన‌కూడ‌ద‌ని, ఇప్ప‌టికే ఉన్న ఫోన్ల‌ను పారేయాల‌ని అక్క‌డి ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. దీని వెనుక బ‌ల‌మైన కార‌ణ‌మే ఉంది. ఈ కంపెనీల ఫోన్ల‌లో ఉన్న సెన్సార్‌షిప్ కార‌ణంగా కొన్ని ప‌దాల‌ను ఇవి ఆటోమేటిగ్గా బ్లాక్ చేస్తోంది.

అక్క‌డి ర‌క్ష‌ణ శాఖకు చెందిన‌ నేష‌న‌ల్ సైబ‌ర్ సెక్యూరిటీ సెంట‌ర్ తాజాగా విడుద‌ల చేసిన రిపోర్ట్‌లో ఈ ఆరోప‌ణ‌లు చేసింది. ఈ ఫోన్లలోని సెన్సార్‌షిప్ కార‌ణంగా ఫ్రీ టిబెట్, లాంగ్ లివ్ తైవాన్ ఇండిపెండెన్స్‌, డెమొక్ర‌సీ మూవ్‌మెంట్ వంటి 449 ప‌దాలను ఈ ఫోన్లు ఆటోమేటిగ్గా బ్లాక్ చేస్తున్నాయ‌ని అక్క‌డి ర‌క్ష‌ణ శాఖ వెల్ల‌డించింది. షియోమీ ఫ్లాగ్‌షిప్ మోడ‌ల్ ఎంఐ 10టీ 5జీ ఫోన్‌లోనూ ఈ సెన్సార్‌షిప్ క‌నిపించిన‌ట్లు లిథుయేనియా సైబ‌ర్ సెక్యూరిటీ తెలిపింది. దీంతో చైనా ఫోన్ల‌ను కొనొద్దంటూ లిథుయేనియా ర‌క్ష‌ణ శాఖ స‌హాయ మంత్రి మార్గిరిస్ అబుకెవిసియ‌స్ ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. అంతేకాదు ఇప్ప‌టికే ఆ ఫోన్లు ఉంటే వాటిని ప‌క్క‌న పెట్టాల‌ని ఆదేశించారు. అయితే ఈ ఆరోప‌ణ‌ల‌ను షియోమీ సంస్థ ఖండించింది. త‌మ ఫోన్ల‌లో అలాంటి సెన్సార్‌షిప్ ఏదీ లేద‌ని చెప్పింది.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *