చీర‌లు వ‌ద్దంటే వెళ్లిపోవ‌చ్చ‌ని చెప్పిన మ‌హిళా ఎంపీపీ..

Share On

బ‌తుకమ్మ పండుగ కోసం తెలంగాణ ప్ర‌భుత్వం తెలంగాణ ఆడ‌ప‌డుచుల‌కు బ‌తుక‌మ్మ చీర‌లు పంపిణీ చేసింది. ప్ర‌తి ఒక్క‌రూ కొత్త బ‌ట్ట‌లు క‌ట్టుకోని బ‌తుక‌మ్మ పండుగ‌ను అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హించుకోవాల‌ని ప్ర‌భుత్వ ఆలోచ‌న‌తో పంపిణీ కార్య‌క్ర‌మాన్ని మొద‌లెట్టింది. ఐతే కొన్ని చోట్ల కొంత‌మంది మ‌హిళ‌లు ఈ చీర‌లు నాణ్య‌త‌గా లేవ‌ని, త‌మ‌కు వ‌ద్ద‌ని నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు.

వనపర్తి జిల్లా కొత్తకోట మండలం సంకిరెడ్డిపల్లి గ్రామంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో కూడా అలజడి రేగింది. నాణ్యత లేని చీరలు తమకొద్దని మహిళలు నిరసన వ్యక్తం చేశారు. దాంతో ఎంపీపీ మౌనిక.. స్థానిక మహిళలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అవమానకరంగా మాట్లాడారు. చీరలు వద్దనుకుంటే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని ఎంపీపీ వ్యాఖ్యానించారు. అదేవిధంగా చీరలు వద్దన్న వాళ్లందరికీ పింఛన్లు కూడా ఇవ్వొద్దని అధికారులకు హుకుం జారీ చేశారు. చీరలు ప్యాక్ చేసి వెనకకు తీసుకెళ్లాలని.. ఎవరికీ చీరలు ఇవ్వొద్దని ఆర్ఐని ఆదేశించింది. దాంతో స్థానిక మహిళలు ఆగ్రహంతో సమావేశం నుంచి శాపనార్థాలు పెట్టుకుంటూ వెళ్లిపోయారు. వెంటనే స్పందించిన జడ్పీ వైస్ చైర్మన్ వామన్ గౌడ్ మహిళలను రమ్మని పిలిచినా ఎవ్వరు తిరిగి రాలేదు. దాంతో అధికారులు, ప్రజాప్రతినిధులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *