ఆ బామ్మ ఒక స్పూర్తి.. నేను చేయి చాచి బిచ్చ‌మెత్త‌లేమ‌ని..

Share On

ఒక‌ప్పుడు పెద్ద పెద్ద న‌గరాల‌లోనే బిచ్చ‌మెత్తేవారు.. కాని ఇప్పుడు బిచ్చ‌మెత్త‌డం గ్రామాల‌కు కూడా వ్యాపిస్తోంది.. నగ‌రాల‌లో బిచ్చ‌మ‌నేది ఒక వ్యాపారంగా మారిపోయింది. అలాంటిది 90, 100 సంవ‌త్స‌రాల వ‌య‌స్సులో ఉన్న ఒక బామ్మ త‌న ఆత్మాభిమానం చంపుకోకుండా.. తాను ఎవ‌రిని చేయి చాచి రూపాయి అడ‌గ‌న‌ని, త‌న ద‌గ్గ‌ర ఉన్న పెన్నులు కొంటె చాల‌ని ఆ వ‌య‌సులో కూడా నిజాయితీగా బ‌తుకుతోంది.. ఆ బామ్మ నిజంగా స్పూర్తినే..

రీఅప్ స్టూడియో వ్యవస్థాపకురాలు శిఖా రథి ఒక బామ్మ ఫోటోని షేర్ చేస్తూ.. ఆమె గురించి చెప్పిన విషయం అందరినీ ఆకట్టుకుంది. తాను తన స్నేహితులతో కలిసి పూణేలోని ఎమ్‌జి రోడ్‌లో వెళ్తున్న సమయంలో రతన్ అనే బామ్మను కలిసినట్లు చెప్పారు శిఖా. అంతేకాదు.. ఆ బామ్మ ఒక కార్డు బోర్డు తో తయారు చేసిన పెట్టెలో కొన్ని రంగురంగుల పెన్నులను పెట్టుకుని అమ్ముతున్నారు.. ఆ బోర్డు కు ఒక నోట్ ఉంది. అదేమిటంటే.. నేను యాచకురాలని కాను.. నేను ఎవరి దగ్గరా చేయి చాచను.. నాకు మీ ధర్మం వద్దు.. నా దగ్గర ఉన్న పెన్నులు కొనండి చాలు.. ఒకొక్క పెన్ను ఖరీదు రూ. 10 లు మాత్రమే .. థ్యాంక్యు. బ్లెస్‌ యూ’.. అని రాసుంది.

రతన్ బామ్మ విద్యార్థులను, వాహనదారులను రిక్వెస్ట్ చేసి.. తన వద్ద ఉన్న పెన్నులు అమ్ముతుంది. ఇలా అమ్మగా వచ్చిన డబ్బులతో జీవితం గడుపుతుంది. ఈ విషయం తెలుసుకున్న శిఖా బామ్మ ఫోటో తీసి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్‌ చేశారు. అంతేకాదు తన జీవితంలో నిజమైన ఛాంపియన్ రతన్ ను ఈరోజు కలిసినట్లు చెప్పారు. అంతేకాదు నేను నా ఫ్రెండ్ బామ్మ దగ్గర పెన్నులు కొనుగోలు చేశామని.. అప్పుడు ఆ బామ కళ్లలోని వెలుగు.. కృతజ్ఞత స్పష్టంగా చూశామని.. తాను చేసిన పని తనకు ఎంతో తృప్తినిచ్చిందని తెలిపేరు శిఖ. అంతేకాదు.. తన స్నేహితులు, తనకు తెలిసిన వారు ఎవరైనా బామ్మ పెన్నులు అమ్మే పరిసరప్రాంతాల్లో ఉంటే.. తప్పని సరిగా పెన్నులు కొనమని చెప్పారు. ఇక శిఖా రథి షేర్ చేసిన ఫోటోని చూసిన కొందరు టిజన్లు బామ్మకు హేట్సాఫ్ చెప్పడంతో పాటు పెన్నులు కొనాలని మన వంతు సాయం చేస్తామని కామెంట్లు చేస్తున్నారు


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *