ఆ తెగ‌లో ఒకే మ‌హిళ‌తో ఐదుగురు అన్న‌ద‌మ్ముల పెళ్లి..

Share On

ప్ర‌పంచంలో ఏ దేశంలో లేని ఆచారాలు, సంప్ర‌దాయాలు భార‌తదేశంలో ఉన్నాయి.. మ‌న భార‌తీయ సంప్ర‌దాయ ప్ర‌కారం పెళ్లి చేసుకోవాల‌ని ఇత‌ర దేశాల వారు ఎంతోమంది త‌పిస్తూనే ఉంటారు. కాని మ‌న‌దేశంలో ఇప్ప‌టికి కొన్ని తెగ‌ల‌లో వింత ఆచారాల మ‌ధ్య పెళ్లిళ్లు జ‌రుగుతున్నాయి. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని పల్లెటూర్లలో ఇప్పటికీ పురాతన తెగలకు సంబంధించిన ట్రైబల్ జాతి ప్రజలు నివాసం ఉంటున్నారు. ఈ ట్రైబల్ జాతి ప్రజలు తమ పూర్వీకులు ఆచరించి ఆచార సంప్రదాయాలను ఇప్పటికీ పాటిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా గతంలో ఆడపిల్లల కొరత ఎక్కువగా ఉండటం మరియు మగపిల్లలు ఎక్కువగా ఉన్న ఇంట్లో ఆస్తిపాస్తులు ఎక్కువగా లేకపోవడం వంటి సమస్యలు కారణంగా వీటిని అధిగమించేందుకు కొందరు వ్యక్తులు కలిసి కొన్ని నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఇంట్లో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువమంది అన్నదమ్ములు ఉంటే ఒకే మహిళను పెళ్లి చేసుకోవాలని ఇలా చేయడం వల్ల ఆడపిల్లల కొరత తగ్గడంతో పాటు ఉమ్మడి కుటుంబాలను ప్రోత్సహించవచ్చనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కొందరు పెద్దలు చెబుతున్నారు.

గతంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ అక్కడి ప్రజలు మాత్రం ఇప్పటికీ ఇదే ఆచారాన్ని ఆచరిస్తున్నారు. ఇటీవలే ఒకే కుటుంబంలోని ఐదుగురు అన్నదమ్ములను పెళ్లాడిన ఒక‌ మహిళ ఈ విషయం ఇటీవ‌ల వెలుగులోకి వ‌చ్చింది. అందులో భాగంగా తాను ఒకే కుటుంబంలో ఉన్నటువంటి ఐదుగురు అన్నదమ్ములను పెళ్లి చేసుకున్నప్పటికీ తమ మధ్య ఎలాంటి మనస్పర్థలు, విభేదాలు లేకుండా కాపురం చేస్తున్నట్లు తెలిపింది. అంతేకాకుండా తాము అందరూ కలిసి ఇ ఒకే చోట భోజనం చేస్తామని అలాగే ఒకే గదిలో పడుకుంటామని చెప్పుకొచ్చింది. అయితే పెళ్లయిన కొత్తలో ఈ విషయం కొంతమేర ఇబ్బంది కలిగించినప్పటికీ క్రమక్రమంగా అలవాటు అయిందని చెప్పుకొచ్చింది. అలాగే తన భర్తలు కూడా తనని కంటికి రెప్పలా కాపాడుకుంటారని తెలిపింది. ఇక తమ వైవాహిక జీవితం విషయం గురించి స్పందిస్తూ తాను ఒక్కో వారం ఒక్కో భర్తతో కలిసి ఉండాలని పెళ్లి సమయంలో నిర్ణయం తీసుకున్నానని దాంతో ఇప్పటికీ ఆ నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపింది.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *