ఇంజ‌నీరింగ్ విద్యార్థినిపై అత్యాచార‌య‌త్నం..

Share On

ఒక ఇంజ‌నీరింగ్ విద్యార్థినీ త‌న స్నేహితుడి బైక్‌పై వెళుతుండ‌గా గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు క‌ర్ర‌ల‌తో బెదిరించి వారి ఇద్ద‌రిపై దాడి చేశారు. అనంత‌రం యువ‌తిని చెట్ల పొద‌ల్లోకి తీసుకెళ్లేందుకు ప్ర‌య‌త్నం చేయ‌గా గ‌ట్టిగా కేక‌లు వేయ‌డంతో నిందుతులు పారిపోయారు. ఈ దారుణ సంఘ‌ట‌న గుంటూరు న‌గ‌ర శివారులో జ‌రిగింది. గురువారం రాత్రి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాడికొండ మండలం మోతడకలోని ఒక‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో చదువుతున్న యువతి తన స్నేహితులతో కలిసి ద్విచక్రవాహనంపై గుంటూరు వెళ్తున్న సమయంలో కొందరు యువకులు వారిపై కర్రతో దాడి చేశారు. యువతిని చెట్ల పొదల్లోకి తీసుకెళ్లేందుకు ప్ర‌య‌త్నించ‌గా యువతి, యువకుడు గట్టిగా కేకలు వేయడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. ఘటనపై బాధితులు తాడికొండ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *