ఆ తెగ‌లో ఇప్ప‌టికి ఒక వింత ఆచారం.. అంగ‌వైక‌ల్యం ఉన్న మ‌హిళ‌కు

Share On

ప్ర‌పంచంలోని ఒక్కొ ప్రాంతంలో ఒక్కో వింత ఆచారం ఉంది.. ఇప్ప‌టికి వారి ఆచారాల ప్ర‌కారం జీవ‌నం సాగించే తెగ‌లు బొలెడు ఉన్నాయి. ఒక గిరిజ‌న ప్రాంతంలోని అమ్మాయిల‌కు కుక్క‌ల‌తో పెళ్లి జ‌రిపిస్తారు. ప్ర‌పంచం ఎంతో అభివృద్ది చెంది ముందుకు సాగుతున్న‌ జార్ఖండ్ రాష్ట్రంలోని కొంత‌మంది గిరిజ‌న తెగ‌కి చెందిన ప్ర‌జ‌లు పెళ్లి విష‌యంలోనే కాదు.. మూడ న‌మ్మ‌కాల విష‌యంలో కూడా చాలా వెన‌క‌బ‌డి వున్నారు.

జార్ఖండ్ రాష్ట్రంలోని పరిసర ప్రాంతాల్లో పురాతన తెగలకి చెందిన గిరిజన తెగ ప్రజలు నివాసం వుంటున్నారు. వీళ్లు తెలిసింది ప్ర‌కృతి ఆధారంగా బ‌త‌క‌ట‌మే. అందుకే ఎక్కువగా వ్యవసాయంపైనే ఆధారపడి జీవ‌నం కొన‌సాగిస్తుంటారు. వ్య‌వ‌సాయంతో పాటు వాళ్లు జీవ‌నం సాగించటానికి ద‌గ్గ‌ర‌లోని అడ‌వికి వెళ్లి వేట ఆడ‌టం, పండ్లు కోయ‌టం వంటి ప‌నులు చేసి వాటి తింటూంటారు. వీరు నివ‌సించే ప్రాంతాలు అభివృద్దికి నోచుకోక‌పోవ‌టంతో విద్య అంద‌ని దాక్ష పండు అయింది. ఈ గిరిజ‌న తెగ ప్ర‌జ‌లు ఇప్ప‌టికి వారి పూర్వీకులు పాటించే ఆచార సంప్ర‌దాయాలు విడిచిపెట్టకుండా పాటిస్తారు. దేశంలో ప‌లు గిరిజ‌న తెగల్లో క‌నుమ‌రుగై పోయిన ఎన్నో గిరిజ‌న పండుగ‌లు ఇక్క‌డ ప్రాంత వాసులు ఎంతో ఘ‌నంగా జ‌రుపుకుంటారు. ఈ గిరిజ‌న తెగ‌కి ఒక మూఢ న‌మ్మ‌కం వుంది.

ఈ తెగ‌లో ఎవ‌రైన బాలుడు, లేదా బాలిక అంగ వైక‌ల్యంతో పుట్టిన‌, దీర్ఝ‌కాలిక వ్యాధుల‌తో జ‌న్మించిన వారికి దెయ్యం పట్టినట్లుగా భావిస్తారు. అలాగే వారికి పెళ్లి జ‌రిపించే స‌మ‌యంలో ఎంతో విడ్డూరంగా అనిపించే వింత ఆచారాల‌ను పాటిస్తారు. అంగ వైక‌ల్యం..లేదా దీర్ఘ‌కాలిక వ్యాధి వున్న అబ్బాయిల‌కి అయితే గాడిద‌తో పెళ్లి జ‌రిపిస్తారు. అమ్మాయి అయితే కుక్కుతో వివాహం జ‌రిపిస్తారు. అయితే శోభ‌నం రోజు మాత్రం కుక్క‌ను అమ్మాయికి దూరంగా వుంచుతారు. కుక్క‌తో వివాహం జ‌రిగిన మూడు రోజుల త‌ర్వాత ఆ వ‌ధువుకి మ‌రో అబ్బాయి తో వివాహం య‌ధావిధిగా జ‌రిపిస్తారు. ఇలా చేస్తే వ‌ధువుకి ప‌ట్టిన దోషం తొలగిపోతుంద‌ని అక్క‌డి గిరిజ‌న తెగ ప్ర‌జ‌ల న‌మ్మ‌కం..


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *