బ్లాక్ ఫంగ‌స్‌తో భార్య మ‌ర‌ణం.. భార్య మ‌ర‌ణాన్ని త‌ట్టుకోలేక‌

Share On

కొన్ని ప్రేమ‌లు వ‌ర్ణించ‌లేనివి.. భ‌ర్త లేకుండా భార్య ఉండ‌లేరు.. భార్య లేకుండా భ‌ర్త ఉండ‌లేరు.. త‌ల్లి, తండ్రి, కూతురు కొంద‌రు వారి బంధాన్ని విడిచి క్ష‌ణం కూడా ఉండ‌లేని ప‌రిస్థితి.. అలాంటిది క‌ర్ణాట‌క‌లో ఒక దారుణ సంఘ‌ట‌న జ‌రిగింది. ఒక వ్య‌క్తి భార్య‌కు బ్లాక్ ఫంగ‌స్ సోకింది.. అది చివ‌ర‌కు ఆవిడ ప్రాణాలు తీసింది. భార్య మ‌ర‌ణాన్ని జీర్ణించుకోలేని భ‌ర్త‌, త‌న న‌లుగురు పిల్ల‌ల‌తో క‌లిసి ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. కర్ణాటక రాష్ట్రం హుక్కేరి తాలుకాలోని ఒక‌ గ్రామంలో శనివారం చోటుచేసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం.. గోపాల్‌ హదిమాని (46), ఆయన పిల్లలు సౌమ్య (19), శ్వేత (16), సాక్షి (11), శ్రీజన్‌ హదిమాని (8) శుక్రవారం రాత్రి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఉదయం నుంచి కుటుంబసభ్యులెవరూ బయట కనిపించకపోవడంతో పక్కింటి వాళ్లు పోలీసులకు సమాచారమిచ్చారు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *