జైలు నుంచి విడుద‌ల చేశారు.. గంట‌ల్లోనే అరెస్టు చేశారు..

Share On

మ‌య‌న్మార్‌లో సైనికులు అక్క‌డి ప్ర‌భుత్వాన్ని బంధించి సైనికులు పరిపాల‌న సాగిస్తున్నారు. సైనిక పాల‌న‌కు నిర‌స‌న‌గా అక్క‌డ ర‌ణ‌రంగ‌మే మొద‌ల‌యింది. అప్పుడు ఎంతోమందిని సైనిక ప్ర‌భుత్వం జైళ్లో పెట్టింది. గత వారం దాదాపు 5 వేలకు పైగా ఖైదీలను మయన్మార్‌ సైనిక ప్రభుత్వం విడిచిపెట్టింది. వీరిలో నుంచి దాదాపు 110 మందిని తిరిగి అరెస్ట్‌ చేసి జైలుకు తరలించారు. వీరికి గతంలో జారీ చేసిన క్షమాభిక్షను సైనిక ప్రభుత్వం రద్దు చేయడంతో ఈ పరిణామం చోటుచేసుకున్నది. పలువురిని జైలు ప్రవేశ ద్వారం వద్దనే పట్టుకోగా.. మరికొంత మందిని ఇంటికి చేరుకున్న గంటలోపే అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు. మయన్మార్ ఉగ్రవాద నిరోధక చట్టం ప్రకారం వీరందిరినీ పోలీసు కస్టడీలో ఉంచారు. తప్పుడు వార్తలు ప్రచారం చేశాడన్న ఆరోపణలపై గత మే 21 న అరెస్ట్‌ చేసినట్లు బందీగా ఉన్న లై లై నాంగ్ అనే వ్యక్తి చెప్పారు. తన 84 ఏండ్ల వయసున్న తల్లిని చూసుకోవడం చాలా ఇబ్బందికరంగా ఉన్నదని, తనపై తప్పుడు కేసులను ఎత్తివేయాలని ఆయన వేడుకుంటున్నాడు. లైలై నాంగ్‌కు మూడేండ్ల జైలు శిక్ష విధించారు. కాగా, గత సోమవారం మయన్మార్‌లో 5,600 మందికి పైగా ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించి విడుదల చేశారు.

మయన్మార్‌లో 2021 ఫిబ్రవరి 1న ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వం పడగొట్టిన అనంతరం.. అక్కడి సైనిక పాలన తొలిసారిగా 700 మంది ఖైదీలను విడుదల చేయాలని ఆదేశించింది. విడుదలైన ఖైదీలలో సైనిక పరిపాలనకు వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టిన వారు కూడా ఉన్నట్లు బర్మీస్ వార్తా నివేదికలు తెలిపాయి. అలాగే, మయన్మార్ మిలిటరీ ద్వారా నిర్వహిస్తున్న మావెడి టెలివిజన్ ఛానెల్ అధికారులు, 24 మంది ప్రముఖులపై కేసులను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు. ఇందులో నటులు, క్రీడాకారులు, సోషల్ మీడియాతో సంబంధం ఉన్న వ్యక్తులు, వైద్యులు, ఉపాధ్యాయులు ఉన్నారు. తిరుగుబాటు తర్వాత ఆంగ్ సాన్ సూకీతో పాటు ఇతర నాయకులు అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *