మీ ద‌గ్గ‌ర చిల్ల‌ర నాణెలు ఉంటే వృధాగా ఖ‌ర్చుపెట్ట‌కండి..

Share On

ఒక‌ప్పుడు ఎవ‌రి ద‌గ్గ‌ర చూసినా ఇష్టానుసారంగా చిల్ల‌ర ఉండేది.. ఇప్పుడు చిల్ల‌ర కావాలంటే దొర‌క‌ట్లేదు.. అందుకు మీ ద‌గ్గ‌ర చిల్లర నాణెలు ఉంటే మాత్రం భ‌ద్రంగా దాచిపెట్టండి.. ఇప్పుడు ఆ చిల్ల‌ర నాణెలు పెద్ద లాభాలు తెచ్చే పెట్టుబ‌డులుగా మార్చుకోవ‌చ్చు.. దానికోసం ఒక సంస్థ‌నే ప‌నిచేస్తోంది అదే నియో ఫిన్ టెక్ సంస్థ‌..

సాధారణంగా మనం వందలు, వేల రూపాయలు ఖర్చు చేసినప్పుడు.. చిల్లర గురించి పెద్దగా పట్టించుకోం. ఐదు, పది రూపాయల చిల్లరను ఎవరూ సేవింగ్స్‌లో భాగమని భావించరు. అలాంటి చిల్లరను కూడా మంచి లాభాలు తెచ్చే పెట్టుబడులుగా మార్చుకోవచ్చని నిరూపిస్తోంది నియో (Niyo) ఫిన్ టెక్ సంస్థ. ఈ సంస్థ దాదాపు 2.5 మిలియన్ల కస్టమర్లను కలిగి ఉంది. వీరిలో దాదాపు 7000 మంది కార్పొరేట్లు ఉండటం విశేషం. ఈ సంస్థ తాజాగా ‘NiyoX’ అనే ‘టూ ఇన్ వన్’ వెల్త్ ప్లస్ సేవింగ్స్ అకౌంట్‌ను పరిచయం చేసింది. ఈ కంపెనీ ఇప్పుడు తమ కస్టమర్ల కోసం ‘ఇన్వెస్ట్ ది ఛేంజ్’ (Invest the Change) అనే ఒక ఫీచర్‌ను తీసుకు వచ్చింది. దీని ద్వారా కస్టమర్లు తమ దగ్గర ఉన్న చిల్లరను పెట్టుబడులుగా మార్చుకోవచ్చు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *