స్కూల్ ద‌గ్గ‌ర్లో మ‌ద్యం షాపు ఉంది.. మూసేయ్యండి అంటూ

Share On

త‌మ పాఠ‌శాల ద‌గ్గ‌ర్లో మ‌ద్యం షాపు ఉంది.. అక్క‌డ మ‌ద్యం సేవించే వారు ఉండ‌డంతో తాము పాఠ‌శాల‌కు వెళ్లేముందు, వ‌చ్చేముందు ఇబ్బందిగా ఉంద‌ని దానిని మూసి వేయాల‌ని ఇద్ద‌రు విద్యార్థులు జిల్లా క‌లెక్ట‌ర్‌కు ఫిర్యాదు చేశారు. విద్యార్థుల ఫిర్యాదుకు వెంట‌నే స్పందించిన అధికారులు ఆ మద్యం షాప్‌ను మూసివేసి మరో చోటకు తరలించాలని ఆదేశించారు. తమిళనాడు అరియలూరు జిల్లాలో ఈ ఘటన జరిగింది.

త‌మిళ‌నాడు రాష్ట్రంలో నవంబర్‌ నుంచి ప్రాథమిక స్కూళ్లు తెరువనున్నారు. అక్కా, తమ్ముడైన ఇలంతేంద్రల్, అరివరసన్ 6వ, 4వ తరగతులు చదువుతున్నారు. వారి స్కూలుకు సమీపంలో మద్యం షాపు ఉండటంపై వారిద్దరు జిల్లా కలెక్టర్‌కు వారు లేఖ రాశారు. స్కూళ్లు తెరిచేలోపు దానిని మూసివేయాలని కోరారు. వారు అక్కడ మ‌ద్యం తాగుతూ అక్కడ కూర్చుని అసభ్యంగా మాట్లాడతారు. ఇది మాకు చాలా భయంగా ఉంది. మద్యం వల్ల చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను పనికి పంపి భిక్షాటన చేయిస్తున్నారు. అన్ని మద్యం దుకాణాలను మూసివేస్తే అలాంటి సమస్య ఉండదని మీడియాతో అన్నారు. విద్యార్థుల లేఖపై అరియలూర్ కలెక్టర్ పీ రమణ సరస్వతి స్పందించారు. కోర్టు నిబంధనల ప్రకారం పాఠశాలకు 100 మీటర్ల దూరంలో మద్యం షాపు ఉన్నదని తెలిపారు. అయినప్పటికీ స్కూల్‌ పిల్లల ఫిర్యాదుతో దానిని మూసివేసి మరో చోటకు మార్చాలని ఆదేశించినట్లు చెప్పారు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *