ఇద్ద‌రి మ‌హిళ‌ల‌కు సంతానం కోసం.. ఇద్ద‌రిని బ‌లిఇచ్చారు..

Share On

రోజురోజుకు శాస్త్ర‌సాంకేతిక రంగం ఎంత‌గా అభివృద్ది చెందుతున్న ఇంకా మూఢ‌న‌మ్మ‌కాల మాయ‌లో దారుణాలు జ‌రుగుతూనే ఉన్నాయి. భూత‌వైద్యుల‌నే న‌మ్ముతూ, వారి చెప్పింది చేయ‌డానికి ఎంత‌కైనా తెగించేవారు ఉన్నారు. మంత్రాల నెపంతో అమాయకుల ప్రాణాలను బలిగొంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో వెలుగుచూసింది. పిల్లలు కలగాలని సంతానంలేని ఒక‌ జంట భూతవైద్యుడి ఆశ్రయించిన ఘటనలో ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్టు చేయగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

గ్వాలియర్‌కు చెందిన బంటు బదౌరియా, మమత దంపతులకు 18 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే వారికి ఇప్పటివరకు సంతానం కలగలేదు. దీంతో మిత్రుడు నీరజ్‌ పర్మార్‌ ఆ దంపతులను భూతవైద్యుడిగా చెప్పుకుంటున్న గిర్వార్‌ యాదవ్‌ వద్దకు తీసుకెళ్లాడు. అయితే ఓ వ్యక్తిని బలిస్తే సంతానం కలుగుతుందని ఆ మాంత్రికుడు దంపతులకు సెలవిచ్చాడు. దీంతో బలిచ్చేందుకు వ్యక్తి కోసం వేట ప్రారంభించిన వారి మిత్రుడు నీరజ్‌ పర్మార్‌.. ఈనెల 13న ఓ సెక్స్‌ వర్కర్‌ను తీసుకువచ్చాడు. అక్కడే ఆమెను హత్య చేసి ద్విచక్రవాహనంపై మృతదేహాన్ని తరలించేందుకు ప్రయత్నించాడు. అయితే కొద్దిదూరం వెళ్లగా.. బైక్‌ జారి కిందపడిపోయింది. దీంతో భయాందోళన చెందిన నీరజ్‌ మృతదేహాన్ని రోడ్డు పక్కన తుప్పల్లో పడేసి అక్కడి నుంచి పరారయ్యాడు.

ఇంత జరిగినప్పటికీ బలి విషయంలో వారు వెనక్కి తగ్గలేదు. వారంరోజుల వ్యవధిలో అక్టోబర్‌ 20న మరో సెక్స్‌ వర్కర్‌ను ట్రాప్‌చేసి ఆమెను హత్యచేశారు. ఆమెకు మత్తుమందు ఇచ్చి భూతవైద్యుని ఎదుట బలిచ్చారు. మొదట హత్యకు గురైన మహిళ మృతదేహం ఈ 21న లభించడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రధాన నిందితుడు నీరజ్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా ఈ విషయాలను వెల్లడించాడు. దీంతో భూతవైద్యుడు సహా ఆ దంపతులను పోలీసులు అరెస్టు చేశారు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *