పిల్ల‌ల‌ను క‌నండి.. ఉచితంగా భూమిని తీసుకొండి..

Share On

కొన్ని దేశాల్లో జ‌నాభా విప‌రీతంగా పెరిగిపోతుంటే.. మ‌రికొన్ని దేశాల్లో జ‌నాభా రోజురోజుకు త‌గ్గిపోతుంది.. జ‌నాభా త‌గ్గిపోతున్న ప్రాంతాల్లో పిల్ల‌లు క‌నేవారికి అక్క‌డి ప్ర‌భుత్వాలు ఆఫ‌ర్ల మీద ఆఫ‌ర్లు ప్ర‌క‌టిస్తున్నారు. తమ దేశ జనాభా పెంచడానికి వివిధ మార్గాల్లో ప్రజలను ప్రోత్సహిస్తుంటాయి. ఇటీవల ఆస్ట్రేలియాలోని క్విల్పీ నగరంలో ఒక ప్రత్యేక కేసు బయటపడింది. ఇక్కడ జనాభాను పెంచడం అధికారులకు ఒక సవాలుగా మారింది. ఎందుకంటే ఇక్కడ జనాభా చాలా తక్కువ. గణాంకాల ప్రకారం అక్కడి జనాభా 800 మంది మాత్రమే. ఈ క్రమంలో జనాభాను పెంచడానికి అధికార యంత్రాంగం అక్కడి ప్రజలకు ఉచిత భూమి ఆఫర్ ప్రకటించింది. జనాభా కొరత కారణంగా పశుపోషణ, గొర్రెల పెంపకానికి సంబంధించిన ఉద్యోగాలను భర్తీ చేయడంలో అక్కడి ప్రభుత్వం ఇబ్బందులను ఎదుర్కొంటోంది. అయితే బ్రిటన్, ఇండియా, హాంకాంగ్, న్యూజిలాండ్ ప్రజలు వలస వెళ్లడంద్వారా ఉచిత భూమిని పొందడం గురించి ఆరా తీశారు. అయితే అక్కడ భూమి ఉచితంగా తీసుకోవాలంటే ఆస్ట్రేలియా పౌరులు లేదా శాశ్వత నివాసితులుగా ఉన్న వ్యక్తులు మాత్రమే అర్హులుగా పరిగణిస్తున్నారు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *