ఇక‌పై పుట్టిన‌రోజుల‌కు మొక్క‌లు బ‌హుమ‌తిగా ఇవ్వండి..

Share On

ప్ర‌కృతిని కాపాడ‌టం మ‌నంద‌రి బాధ్య‌త‌.. ప‌ర్యావ‌ర‌ణ ర‌క్ష‌ణ కోసం ప్ర‌తి ఒక్క‌రూ పాటుబ‌డాల‌ని ప్ర‌భుత్వాలు ప్ర‌చారం చేస్తున్నాయి. ఇప్పుడు ఢిల్లీ మ‌రో అడుగు ముందుకేసింది. వివాహాలు, పుట్టిన రోజుల్లాంటి ప్రత్యేక సందర్భాల్లో ఖరీదైన బహుమతులకు బదులుగా మొక్కలను బహుమతిగా ఇచ్చేలా దక్షిణ ఢిల్లీ మునిసిపల్‌ కార్పొరేషన్‌(ఎస్‌డీఎంసీ) ప్రారంభించిన ‘గిఫ్ట్‌ ఏ స్కీమ్‌’ పథకానికి విశేష స్పందన లభిస్తున్నది. కేవలం మూడు రోజుల్లోనే 60 మంది ఈ స్కీమ్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకొన్నారు. ఈ స్కీమ్‌లో భాగంగా ఎవరైనా గిఫ్ట్‌ ఇవ్వాలనుకొంటే.. ఏ మొక్కను ఇవ్వాలి, ఏ పార్కులో నాటాలి.. అనేది ఆన్‌లైన్‌ ద్వారా ఎంపిక చేసుకోవాలి. దీనికి రూ.2వేల నుంచి రూ.2,500 వరకు చెల్లించాలి. ఎవరికి ఇస్తున్నామో వివరాలు తెలుపాలి. తర్వాత గిఫ్ట్‌కు సంబంధించి ఈ-సర్టిఫికెట్‌ జనరేట్‌ అవుతుంది. దీన్ని గిఫ్ట్‌గా ఇవ్వవచ్చు. తరువాత, ఆ మొక్కను ఎంచుకున్న పార్కులో ఎస్‌డీఎంసీ నాటుతుంది. దాని సంరక్షణ బాధ్యతను చూస్తుంది. మొక్కకు ఏర్పాటు చేసే ట్రీ గార్డుపై ‘బహుమతి గ్రహీత’ల పేరు, వివరాలను రాసి పెడుతుంది. చెట్టు బతికినన్ని రోజులు వారి పేరు అక్కడ నిలిచి ఉంటుంది.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *