17ఏళ్ల బాలిక‌ను వ్య‌భిచారం చేయ‌మ‌ని ఒత్తిడి.. మాట విన‌డం లేద‌ని..

Share On

17 బాలిక అమ్మ‌, నాన్న చ‌నిపోయారు.. బంధువుల ద‌గ్గ‌ర ఉంటుంది.. బంధువులు బ‌ల‌వంతంగా వ్య‌భిచారం చేయ‌మ‌ని హింసించారు.. ఐనా ఆ బాలిక మాట విన‌లేదు.. ఎంత చెప్పిన మాట వినడం లేద‌ని చంపేసి ఆత్మ‌హ‌త్య‌గా చిత్రీక‌రించారు. ఏడు నెల‌ల క్రితం అదృశ్య‌మైన ఆ బాలిక మృత‌దేహాన్ని జార్ఖండ్‌లోని సోనార్ డ్యాం వ‌ద్ద క‌నుగొన్న పోలీసులు మేజిస్ట్రేట్ స‌మ‌క్షంలో దాన్ని వెలికితీశారు. బాలిక‌ను స్వ‌యంగా ఆమె అక్క‌లు రాఖీదేవి (30), రూపాదేవి (25) బావ ధ‌నంజ‌య్ అగర్వాల్ (30) ప్ర‌తాప్ కుమార్ సింగ్‌, నితీష్ అనే మ‌రో ఇద్ద‌రు నిందితులు క‌లిసి హ‌త్య చేయ‌గా నితీష్ మిన‌హా నిందితులంద‌రినీ పోలీసులు అరెస్ట్ చేశారు. పోస్ట్‌మార్టం నివేదిక‌లో బాలిక త‌ల‌కు గాయాలైన‌ట్టు వెల్ల‌డైంది. అయితే బాలిక ఆత్మ‌హ‌త్య చేసుకుంద‌ని ఆమె అక్క‌లు క‌ట్టుక‌ధ‌లు అల్లారు.

పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం బాలిక త‌ల్లితండ్రులు మ‌ర‌ణించ‌డంతో స‌ద్నా ప్రాంతంలో వ్య‌భిచార వృత్తిలో ఉన్న‌ సోద‌రి రాఖీదేవి ఇంట్లో బాలిక ఉంటోంది. రాఖీ, ద‌నుంజ‌య్‌లు బాలిక‌ను వ్య‌భిచారం చేయాల‌ని ఒత్తిడి చేసేవారు. బాలిక ఒక‌ యువ‌కుడిని ప్రేమిస్తూ అతడిని పెండ్లి చేసుకుంటాన‌ని చెప్ప‌గా అక్క‌, బావ నిరాక‌రించారు. రాఖీ ప్రియులైన ప్ర‌తాప్‌, నితేష్‌లు బాలిక‌పై క‌న్నేసి రాఖీ సాయంతో ఆమెపై ప‌లుమార్లు లైంగిక దాడికి య‌త్నించారు. ఈ క్ర‌మంలో రాఖీ ఇంట్లో లేని స‌మ‌యంలో హ‌త్య‌కు రెండ్రోజులు ముందు ఆమె ఇంటికి వ‌చ్చిన ప్ర‌తాప్ బాధితురాలిపై లైంగిక దాడికి పాల్ప‌డి ఆమెను హ‌త్య చేశాడు. ఆపై ఈ విష‌యం రూప, ధ‌నంజ‌య్‌ల‌కు తెలుప‌గా అంద‌రూ క‌లిసి మృత‌దేహాన్ని ఆటోలో నిర్జ‌న ప్ర‌దేశానికి తీసుకువెళ్లి పాతిపెట్టారు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *