ఆ బామ్మ‌కు 84ఏళ్లు వ‌చ్చినా ఇంకా విమానం న‌డుపుతోంది..

Share On

కొంత‌మందికి విమానం ఎక్కాలంటేనే చాలా భ‌యం.. ఆ భ‌యంతో విమానం ఎక్క‌డానికి వెన‌క‌డుగు వేసేవారు చాలా మంది ఉన్నారు. అలాంటిది ఒక 84ఏళ్ల బామ్మ ఇంకా విమానం న‌డుపుతోంది. గేజ్​ అనే ఈ బామ్మ గతంలో పైలెట్​గా పనిచేసింది. వయసు పైబడడంతో తన పనులు చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతోంది. అందుకే ఆమెకి ఇప్పుడు ఏం చేయాలనిపిస్తోందో అది చెయ్యనిస్తే హ్యాపీగా ఉంటుందని, ఫ్యామిలీ మొత్తం కలిసి ఆమె కోరికల లిస్ట్​ తయారుచేశారట. ఇదంతా ఒక ఇంటర్వ్యూలో ఆమె కొడుకు ఎర్ల్ చెప్పాడు. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే ఎర్ల్, కాడి మటియెలో అనే పైలెట్​ని కలిసి, ఈ విషయం చెప్పాడు. ఆయన అందుకు ఒప్పుకున్నాడు. ఇద్దరినీ తీసుకుని, విన్నిపెసాకీ లేక్, కేర్​సర్జ్​ పర్వతం మీదుగా వెళ్లడానికి అనుమతి ఇచ్చారు. దాంతో బామ్మ మళ్లీ పైలెట్ అవతారమెత్తింది. మటియెలో ఫ్లైట్​ని టేకాఫ్ చేసి, అది గాల్లో ఉండగా… ఫ్లైట్​ని కంట్రోల్​ చేయమని బామ్మకి చెప్పి, తను పక్కకి వచ్చాడు. చేతిలో ఉన్న ఫ్లైట్​ని ఎప్పటిలాగానే గాల్లో చెక్కర్లు కొట్టించింది బామ్మ.​ పార్కిన్​సన్స్​ వ్యాధితో బాధపడుతున్న ఆమె, ఈ వయసులో ఫ్లైట్ నడపడం అమేజింగ్​. పైలెట్ బామ్మ విమానం నడుపుతున్న వీడియోని మటియెలో ఫేస్​బుక్​లో షేర్​ చేశాడు. ఆ వీడియో చూసిన నెటిజన్​లు ‘‘ఒన్స్​ ఏ పైలెట్, ఫర్​ఎవర్​మోర్​ ఏ పైలెట్​” , “అనారోగ్యం అనేది పక్కన పెడితే, ఆమె కాన్ఫిడెన్స్​ సూపర్​” అంటూ కామెంట్లు పెడుతున్నారు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *