ఆ మ‌హిళ‌కు ఐదుగురు బిడ్డ‌లు.. ఐనా వివాహేత‌ర సంబంధం పెట్టుకొని..

Share On

వివాహేత‌ర సంబంధాలు ప‌చ్చ‌ని కుటుంబాల్లో చిచ్చులు పెడుతూ.. ప్రాణాల‌ను బ‌లితీసుకుంటున్నాయి.. ఒక మ‌హిళ‌కు ఐదుగురు పిల్లలు.. భ‌ర్త‌తో సంతోషంగా ఉండాల్సింది పోయి వేరే వ్య‌క్తితో వివాహేత‌ర సంబంధం పెట్టుకుంది. ఆ ప్రియుడితో ఎంజాయ్ చేసేందుకు భ‌ర్త అడ్డుగా ఉన్నాడ‌ని భావించి భ‌ర్త‌ను ప్రియుడి స‌హాయంతో చంపేసింది. తీరా శవాన్ని మాయం చేసేందుకెళ్తుండగా కారు మొరాయించడంతో కథ అడ్డం తిరిగింది. చేసేదేమీ లేక కారు, కారులో శవాన్ని అలానే వదిలేసి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సీన‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో భార్య బండారం బయటపడింది. వివాహేతర సంబంధం మోజులో కట్టుకున్న భర్తను కడతేర్చినట్లు తేలింది. ఈ షాకింగ్ ఘటన హయత్‌నగర్‌లో వెలుగుచూసింది.

కర్ణాటకలోని గుల్బర్గా పరిధిలోని ఫెరోజాబాద్‌కి చెందిన మహమూద్ ముస్తాక్ పటేల్(46) ఇరవై ఏళ్ల కిందట నగరానికి వలసొచ్చాడు. కుటుంబంతో సహా సైదాబాద్‌లోని జహంగీర్‌నగర్‌లో నివాసముంటున్నారు. ముస్తాక్ లారీ డ్రైవర్‌గా పనిచేసేవాడు. అతని భార్య ఫిర్జోద్ బేగం కూరగాయాల వ్యాపారం చేస్తోంది. వారికి ఇద్దరు కూతుళ్లు, ముగ్గురు కుమారులు ఉన్నారు. ఐదురుగు బిడ్డలున్న ఆ తల్లి దారితప్పింది. భర్తకి తెలియకుండా మరొకరితో బరితెగించింది. అమీద్ పటేల్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ప్రియుడి మోజులో పడిన ఫిర్జోద్ బేగం.. భర్తను చంపేందుకు పథకం రచించింది. ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హతమార్చింది. నగర శివార్లకు తీసుకెళ్లి ప్రియుడు అమీద్ పటేల్, అతని స్నేహితుడు సయ్యద్ నాయబ్‌తో కలసి ముస్తాక్ పటేల్‌ను కిరాతకంగా చంపేశారు. అనంతరం శవాన్ని మాయం చేసేందుకు వెళ్తుండగా కారు మొరాయించడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. హయత్ నగర్ రేడియో స్టేషన్ సమీపంలో రాజస్థాన్ కళాకరుల బొమ్మల తయారీ కేంద్రం వద్ద కారును వదిలేసి నిందితులు పరారయ్యారు.

కారులో శవాన్ని గుర్తించిన స్థానికులు సమాచారం అందిండచంతో పోలీసులకు రంగంలోకి దిగారు. కారులో శవాన్ని పరిశీలించారు. అతని వద్ద లభించిన డ్రైవింగ్ లైసెన్స్‌, భార్య ఫోన్ నంబర్ ఆధారంగా హతుడు ముస్తాక్ పటేల్‌గా నిర్ధారించారు. భార్య ఫిర్జోద్ బేగంతో పాటు కుటుంబ సభ్యులను పిలిపించి విచారణ జరపడంతో అసలు విషయం బయటపడింది. ఫిర్జోద్ వివాహేతర సంబంధం గురించి తెలియడంతో పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టి కీలక విషయాలు రాబట్టారు. కట్టుకున్న భార్యే ప్రియుడితో కలిసి భర్తను హతమార్చినట్లు తేల్చారు. శవాన్ని తీసుకెళ్తుండగా కారు ఆగిపోవడంతో అక్కడే వదిలేసి పరారైనట్లు వెల్లడైంది. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *