ఆ క‌లెక్ట‌ర్ అంతే.. ఎక్క‌డ రాజీప‌డ‌రు.. అందుకే

Share On

ప్ర‌జ‌ల సొమ్ము తింటున్నందుకు వారికి సేవ చేస్తూ జ‌వాబుదారీగా ఉండాల‌నుకునే అధికారులు చాలా త‌క్కువ‌మంది ఉంటారు.. అవినీతిని స‌హించ‌కుండా, రాజ‌కీయ‌నాయ‌కుల మాట విన‌కుండా నిక్క‌చ్చిగా, సూటిగా ప‌నిచేసే అధికారులు చాలా అరుదు.. ఆ కోవ‌లోనే మొద‌ట‌గా నిలిచే అధికారి ఒక‌రు ఉన్నారు. అత‌నే అశోక్ ఖేంకా..

నిజాయితీ కలిగిన అధికారులు బదిలీ వేటుకు గుర‌వ‌డం అనేది కొత్తేమి కాదు. బదిలీ అధికారుల వ్యక్తిత్వానికి ఒక్కోసారి కొలమానంగా ఉంటుంది. నిజాయితీగా ప్ర‌జ‌ల కోసం ప‌నిచేసే వారికే ఎక్కువ బ‌దిలీలు జ‌రుగుతాయి. హర్యానా ప్రభుత్వం తాజాగా ఒక‌ సీనియర్ ఐఏఎస్ అధికారిని బదిలీ చేసింది. తన 29 ఏళ్ల సర్వీసులో ఆయనకు ఇది 54వ బదిలీ కావడం గమనార్హం. అశోక్ ఖేంకా అనే ఐఏఎస్ అధికారి హర్యాన ప్రభుత్వ అర్చీవ్స్, అర్కియాలజీ అండ్ మ్యూజియం డిపార్ట్‌మెంట్ ప్రన్సిపల్ సెక్రెటరీగా పని చేస్తున్నారు. అత‌నిని శనివారం సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఫిషరీస్ డిపార్ట్‌మెంట్స్ సెక్రటరీగా బదిలీ చేస్తూ హర్యానా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1991వ బ్యాచ్‌కు చెందిన ఈయనకు మంచి అధికారిగా పేరుంది. ఈయన నిజాయితీ వల్లె తన కెరియర్‌లో అన్ని బదిలీలు ఎదుర్కొంటున్నారని ఈయన సన్నిహితులు అంటున్నారు


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *