గిరిజ‌నుల‌కు వేలల్లో మాస్కులు.. శానిటైజ‌ర్లు ఇచ్చారంట‌..

Share On

గిరిజనుల ప్రాణాలను కరోనా వైరస్ నుంచి కాపాడడం కోసం, ఐటిడిఎ ఉట్నూరు వైద్యశాఖ నుంచి ప్రతి రోజు, ప్రతి గూడెంలో అవగాహన కల్పిస్తూ తీరిక లేకుండా మాస్కులు పంపిణీ చేస్తూ, శానిటైజర్ ఇస్తూ.. అవగాహన సదస్సులు ఏర్పాటు చేశామంటున్నారు. కాని గిరిజన గ్రామాల్లోని ప్రజలు మాత్రం ఎవరికి ఇచ్చారో, ఎప్పుడిచ్చారో తెలియదు అంటున్నారు

తెలంగాణలోని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఐటిడిఏలకు ఈ సంవత్సరం కరోనా లాక్ డౌన్ సమయంలో గిరిజనుల ప్రాణాలను కాపాడేందుకు ఐటిడిఎల నుంచి ఏలాంటి చర్యలు తీసుకున్నారు. ఎంతమందికి ఎన్ని మాస్కులు, ఎన్ని శానిటైజర్స్ పంపిణీ చేశారు.. కరోనా వైరస్ నివారణకు ఏలాంటి జాగ్రత్తలు తీసుకొవాలని ఎన్ని అవగాహన సదస్సులు నిర్వహించారని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ నుంచి సమాచార హక్కు చట్టం నుంచి దరఖాస్తు చేశామని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ పౌండర్ రాజేంద్ర పల్నాటి తెలిపారు. సహ చట్టం దరఖాస్తుకు ఎవ్వరు స్పందించలేదని, మొదటి అప్పీలు చేయగా ఉట్నూరు ఐటిడిఎ మాత్రమే స్పందించిందని వారు తెలిపారు. ఉట్నూరు ఐటిడిఏ సమాచార హక్కు చట్టం కింద ఇచ్చిన సమాచారం కూడా నమ్మశక్యంగా లేకుండా పోతుంది. వారు ఇచ్చిన సమాచారం ప్రకారం కొన్ని గిరిజన గ్రామాలను విచారించగా మాస్కులు, శానిటైజర్లు, అవగాహన సదస్సులు ఎప్పుడు నిర్వహించారో, ఎవరికి నిర్వహించారో మాకైతే తెలియదని కొంతమంది గిరిజనులు చెప్పినట్టు సంస్థ సభ్యులు పేర్కొన్నారు.

యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సమాచారహక్కు చట్టం ద్వారా ప్రశ్నించగా ఉట్నూరు వైద్య ఆరోగ్యశాఖ సమాచారం ప్రకారం 32 గిరిజన గ్రామాలో మాస్కులు, శానిటైజర్లు, అవగాహన సదస్సులు నిర్వహించి గిరిజనులను అప్రమత్తం చేశామని అంటున్నారు. గుడిహత్నూర్ గ్రామంలో 10000 మాస్కులు, 800 శానిటైజర్స్, 68అవగాహన సదస్సులు.. అదా గ్రామంలో 12000 మాస్కులు, 700శానిటైజర్స్, 127 అవగాహన సదస్సులు.. కేరమెరి గ్రామంలో 8000 మాస్కులు, 500 శానిటైజర్స్, 114 అవగాహన సదస్సులు.. తల్లాపేటలో 4500 మాస్కులు.. 300 శానిటైజర్స్, 32 అవగాహన సదస్సులు.. మందమర్రిలో 10000 మాస్కులు, 1300 శానిటైజర్స్, 56 అవగాహన సదస్సులు ఇలా మొత్తం ఉట్నూరు ఐటిడిఎ పరిధిలో 203410 మాస్కులు, 16403 శానిటైజర్స్, 2064 అవగాహన సదస్సులు నిర్వహించామని సమాచార హక్కు చట్టం కింద సమాచారం ఇచ్చారని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ పౌండర్ రాజేంద్ర పల్నాటి తెలిపారు..


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *