ద‌క్షిణాఫ్రికాలో రోజురోజుకు పెరుగుతున్న కొత్త వేరియంట్‌..

Share On

క‌రోనా వైర‌స్ నుంచి ప్ర‌పంచం కొలుకుంటుంది అనుకుంటున్న స‌మ‌యంలో ద‌క్షిణాఫ్రికాలో పుట్టుకొచ్చిన కొత్త వేరియంట్ ఇప్పుడు మ‌ళ్లీ ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది.. దక్షిణాఫ్రికాలో సగటున రోజూ 200 మంది కరోనా బారిన పడుతున్నారు. కానీ గత ఐదు రోజులుగా కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఐతే కొత్త వేరియెంట్ వల్లే కేసులు పెరుగుతున్నాయా? అనే విషయాన్ని అక్కడి ప్రభుత్వం వెల్లడించలేదు. మరోవైపు సౌతాఫ్రికా నుంచి ఇప్పటికే పలు దేశాలకు వ్యాపించింది. అక్కడి నుంచి వెళ్లిన వారిలో కొత్త వేరియెంట్ బయటపడుతోంది. ఇజ్రాయెల్‌లో నాలుగు ఒమిక్రాన్ వేరియెంట్ కేసులు నమోదయ్యాయి. సౌతాఫ్రికా నుంచి వచ్చిన 32 ఏళ్ల మహిళలో మొదట ఈ వేరియెంట్‌ను గుర్తించారు. ఐతే ఆమె ఇప్పటికే మూడు డోసుల ఫైజర్ వ్యాక్సిన్ తీసుకుంది. ఐనప్పటికీ కొత్త వేరియెంట్ బారినపడింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్‌ అత్యవసరంగా కేబినెట్‌ సమావేశం ఏర్పాటుచేసి.. కొత్త వేరియంట్‌పై సమీక్షించారు. తమ దేశం అత్యయిక పరిస్థితి ఆరంభంలో ఉన్నట్టు ఆయన వ్యాఖ్యానించారు.

కోవిడ్‌ టీకా రెండు డోసులు తీసుకున్నవారికీ ఒమిక్రాన్ వేరియంట్‌ వైరస్ సోకుతోంది. అధిక మ్యూటేషన్ల కారణంగా డెల్టా కంటే ఇది అత్యంత ప్రమాదకారి కావచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు వెలుగుచూసిన కోవిడ్ వేరియెంట్ల కంటే ఇది వేగంగా వ్యాపించి, తీవ్ర లక్షణాలకు దారితీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైద్య నిపుణుల హెచ్చరికలతో అన్ని దేశాలు అప్రమత్తమవుతున్నాయి. దక్షిణాఫ్రికా సహా మొత్తం ఆరు దేశాల నుంచి వచ్చే విదేశీ ప్రయాణికులపై ఇజ్రాయెల్‌ ఇప్పటికే ఆంక్షలు విధించింది. దక్షిణాఫ్రికా, బోట్స్‌వానా, లెసాతో, ఎస్వాతిన్‌, జింబాబ్వే, నమీబియాల నుంచి రాకపోకలపై నిషేధం విధిస్తున్నట్టు బ్రిటన్ ప్రకటించింది. జర్మనీ, ఇటలీ, సింగపూర్‌, జపాన్‌లు కూడా ఈ దిశగా చర్యలు చేపట్టాయి.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *