క‌రోనా ప్ర‌చార ఖ‌ర్చు రెండునెలల్లోనే 19కోట్ల పైనే

Share On

క‌రోనా వైర‌స్ ఎన్నో ప్రాణాల‌ను బ‌లిగొంది.. ఎంద‌రో జీవితాల‌ను అస్త‌వ్య‌స్తం చేసింది.. ఎన్నో కుటుంబాల‌ను చిన్నాభిన్నం చేసింది.. ప్ర‌జ‌ల‌ను క‌రోనా వైరస్ పేరు వింటేనే వ‌ణికిపోయారు.. ప్ర‌జ‌ల్లో క‌రోనాపై భ‌యం వీడ‌డానికి కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఏం చేసాయి.. ఏలాంటి ప్ర‌చారాలు నిర్వ‌హించాయో మాత్రం తెలియ‌దు. అదే స‌మాచారాన్ని యూత్ ఫ‌ర్ యాంటీ కర‌ప్ష‌న్ సంస్థ స‌మాచార హ‌క్కు చ‌ట్టం ద్వారా ప్ర‌శ్నించ‌గా ప్ర‌చారానికి ఎంత ఖ‌ర్చు చేశారో బ‌య‌ట‌ప‌డింది..

దేశంలో క‌రోనా వైర‌స్ చేసిన చేసిన న‌ష్టం పూడ్చ‌లేనిది.. ఆర్థిక వ్య‌వ‌స్థ‌నే కుదిపేసింది.. ఎంతోమంది ఉపాధి కొల్పోయి, ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్న సంధ‌ర్బాలు ఉన్నాయి.. క్ష‌ణ‌క్ష‌ణం భ‌యంతో వ‌ణికిపోతున్న ప్ర‌జ‌ల‌ను ఒక ధైర్యం కావాలి.. ఎంతోమంది ప్ర‌ముఖులు, స్వ‌చ్చంధ సంస్థలు త‌మ వంతు బాధ్య‌తగా ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కాన్ని ఇస్తూ, అండ‌గా ఉంటూ, ధైర్యాన్ని ఇచ్చారు.. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు కూడా ప్ర‌చార కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించింది.. దేశ వ్యాప్తంగా క‌రోనా నివార‌ణ కోసం ఎంత ఖ‌ర్చు చేశార‌ని అడ‌గ‌గా ప‌లు విష‌యాల‌ను వెల్ల‌డించింద‌ని యూత్ ఫ‌ర్ యాంటీ క‌ర‌ప్ష‌న్ సంస్థ పౌండ‌ర్ రాజేంద్ర ప‌ల్నాటి తెలిపారు.

2020లో క‌రోనా వైర‌స్ వ్యాప్తి ప్రారంభ‌మ‌వ్వ‌గా కేంద్రం ప‌లు చ‌ర్య‌లు తీసుకుంది.. 2020 క‌రోనా వైర‌స్ నుంచి ప్ర‌జ‌ల‌కు నిత్యం అవ‌గాహ‌న‌, ధైర్యాన్ని ఇచ్చేందుకు 2020 మార్చిలోని కొన్ని కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు పెట్టిన‌ట్లు తెలిపింది. దేశ‌వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో అవ‌గాహ‌న‌తో పాటు, ఇత‌ర సామాజిక మాధ్య‌మాల ద్వారా ప్ర‌చారం నిర్వ‌హించామ‌ని అందుకు కొన్ని ప్రింట్ మీడియా, ఎల‌క్ట్రానిక్ మీడియా ద్వారా కూడా ప్ర‌చార కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించామ‌ని అంటోంది. దేశ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ ప్ర‌చార నిర్వ‌హ‌ణ‌కు ఒక్క మార్చి నెల‌లోనే 18 కోట్ల‌కు పైగా ఖ‌ర్చు చేయ‌గా, ఏప్రిల్ ఒక కోటి రూపాయ‌లు ఖ‌ర్చు చేసిన‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం స‌మాచారహ‌క్కు చ‌ట్టం ద్వారా తెలిపిందని యూత్ ఫ‌ర్ యాంటీ క‌ర‌ప్ష‌న్ సంస్థ పేర్కొంది..

రెండు నెలలే ప్రచారం చేశారా..

దేశంలో ప్రజలకు కరోనాపై అవగాహన కలిగించేందుకు 2020సంవత్సరంలో రెండు నెలలే ప్రకటన రూపంలో ప్రచారం చేసినట్లు తెలుస్తోంది. కరోనా సెకండ్ వేవ్ ఎంతోమంది ప్రాణాలను బలితీసుకొని దేశాన్ని కుదిపేసింది. ఈ సమయంలో ప్రజలకు అవగాహన, ప్రకటన రూపంలో ప్రచారం చేసిందో, లేదో మాత్రం అర్థం కావడం లేదు. సమాచారహక్కు చట్టం కింద యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ ప్రశ్నిస్తే 2020 మార్చి నుంచి 2021 వరకు అని సమాధానం ఉంది. మొదటి విడతలో రెండు నెలలే ప్రచారం చేస్తే మరీ మిగతా నెలలంతా ప్రకటన రూపంలో అవగాహన కల్పించలేదని అర్థమవుతోంది..


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *