రెండేళ్ల‌లో క‌రోనా ఖ‌ర్చులు వేల కోట్లే

Share On

జ‌న‌జీవనాన్ని అత‌లాకుత‌లం చేసి.. ఎంద‌రో ప్రాణాల‌ను, మ‌రెంద‌రో ఉద్యోగాల‌ను, ఇంకెద‌రో జీవితాల‌ను అస్త‌వ్య‌స్తం చేసింది క‌రోనా.. క‌రోనా మొద‌టి సంవ‌త్స‌రం నామ‌మాత్రంగా ఉన్నా, రెండో విడ‌త మాత్రం క‌రోనా వైర‌స్ ధాటికి ఎవ‌రూ త‌ట్టుకోలేక ఎంతోమంది ప్రాణాలు కోల్పోయి, ఎంద‌రో ఆనాధ‌లుగా మిగిలారు.. క‌రోనా వైర‌స్‌ను నివారించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం కొన్ని వేల కోట్ల రూపాయ‌ల‌ను ఖ‌ర్చు చేసింది. దేశంలోని రాష్ట్రాల‌కు కేంద్రం నుంచి రెండు సంవ‌త్స‌రాల‌కు ఎంత ఖ‌ర్చు చేసింద‌ని యూత్ ఫ‌ర్ యాంటీ క‌ర‌ప్ష‌న్ సంస్థ స‌మాచార‌హ‌క్కు చ‌ట్టం కింద ప్ర‌శ్నించ‌గా పూర్తి వివ‌రాల‌ను తెలిపింది.

క‌రోనా వైర‌స్ పెరిగిపోతుంది.. రాష్ట్ర ప్ర‌భుత్వాలు త‌మ ఖ‌జానా ఖాళీగా ఉంద‌ని, త‌మ ద‌గ్గ‌ర అంత డ‌బ్బులు లేవ‌ని కేంద్ర ఆదుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేసింది. కాని కేంద్ర క‌రోనా వైర‌స్ నివార‌ణ కోసం ఏఏ రాష్ట్రానికి ఎంత పంపిందో, ఎన్ని విడ‌త‌లుగా పంపిందో మాత్రం ఎవ‌రికి తెలియ‌దు. కేంద్ర ప్ర‌భుత్వం మాత్రం కోట్ల రూపాయ‌లు పంపామ‌ని చెపుతోంది.. దేశంలో కొన్ని రాష్ట్రాలు మాత్రం మాకు పంపింది కొంతే అని చెపుతున్నాయి.. రెండు సంవ‌త్స‌రాలు క‌రోనా వైర‌స్ మాత్రం దేశాన్ని వ‌ణికించింది.. వైర‌స్ నివార‌ణ‌కు రెండు సంవ‌త్స‌రాల‌లో కేంద్రం రాష్ట్రాల‌కు ఎన్ని విడ‌త‌లుగా, ఎంత పంపిణీ చేసిందనే స‌మాచారాన్ని యూత్ ఫ‌ర్ యాంటీ క‌ర‌ప్ష‌న్ సంస్థ కేంద్ర ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించ‌గా కేంద్రం దేశంలో ఏఏ రాష్ట్రాల‌కు ఎన్ని విడ‌త‌లుగా, ఎంత నిధులు అంద‌జేశామో పూర్తి వివ‌రాల‌ను తెలిపింద‌ని యూత్ ఫ‌ర్ యాంటీ క‌ర‌ప్ష‌న్ సంస్థ పౌండ‌ర్ రాజేంద్ర ప‌ల్నాటి తెలిపారు.

కేంద్రం రాష్ట్రాల‌కు ఇచ్చిన క‌రోనా నిధులు..

దేశంలోని రాష్ట్రాల వారీగా 2019-20, 2021-22 సంవ‌త్స‌రాల‌లో ఏఏ రాష్ట్రానికి ఎన్ని నిధులు ఇచ్చిందో ఒక‌సారి ప‌రిశీలిస్తే అండ‌మాన్ నికోబార్ (7.11), ఆంధ్ర‌ప్ర‌దేశ్ (208.96), అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ (63.87), అస్సాం (365.61), బీహార్ (516.43), చంఢీగ‌డ్ (2.84), చ‌త్తీస్‌గ‌డ్ (188.03), దాద్రాన‌గ‌ర్ హ‌వేలి డామ‌న్ డ‌య్యూ (4.76), ఢిల్లీ (15.10), గోవా (5.89), గుజ‌రాత్ (239.61), హ‌ర్యానా (91.21), హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌(108.26), జమ్ముక‌శ్మీర్ (128.82), జార్ఖండ్ (191.67), క‌ర్ణాట‌క (252.02), కేర‌ళ (86.94), ల‌డ‌క్ (31.26), ల‌క్ష్య‌ద్వీప్ (0.74), మ‌ధ్య‌ప్ర‌దేశ్ (437.17), మ‌హారాష్ట్ర (410.39), మ‌ణిపూర్ (38.67), మేఘాల‌య (41.37), మిజోరం (19.93), నాగాలాండ్ (28.11), ఒడిస్సా (258.59), పుదుచ్చేరి (2.71), పంజాబ్ (99.44), రాజ‌స్థాన్ (425.00), సిక్కిం (9.83), త‌మిళ‌నాడు (239.80), తెలంగాణ (149.34), త్రిపురు (41.86), ఉత్త‌ర‌ప్ర‌దేశ్ (939.94), ఉత్త‌రాఖండ్ (122.28), ప‌శ్చిమ‌బెంగాల్ (302.39) కోట్లు రెండు సంవ‌త్స‌రాల‌కు గాను ఇచ్చిన‌ట్లు వెల్ల‌డించింది.

2019-20 సంవ‌త్స‌రంలో దేశ‌వ్యాప్తంగా క‌రోనా ఖ‌ర్చుల కింద‌ అన్నిరాష్ట్రాల‌కు 1113.23 కోట్లు ఇవ్వ‌గా, 2020-21 సంవ‌త్స‌రంలో 8147 కోట్ల నిధులు రాష్ట్రాల‌తో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల‌కు అంద‌జేసిన‌ట్లు తెలిపింది. 2021-22 సంవ‌త్స‌రంలో మొద‌టి విడ‌త కింద అన్ని రాష్ట్రాల‌కు, కేంద్ర పాలిత ప్రాంతాల‌కు మొద‌టి విడ‌త కింద 1827.78 కోట్లు ఇవ్వ‌గా, అదే సంవ‌త్స‌రంలో రెండ‌వ విడ‌త కింద 4248.17 కోట్లు ఇచ్చినట్లు తెలిపింది. మొత్తం రెండు సంవ‌త్స‌రాల‌కు 2019-20, 2021-22 సంవత్స‌రాల‌కు గాను మొత్తం దేశంలోని కేంద్ర ప్ర‌భుత్వం అన్ని రాష్ట్రాల‌కు, కేంద్ర ప్రాంతాల‌కు క‌లిపి 6075.95 కోట్ల రూపాయ‌ల నిధులు ఇచ్చిన‌ట్లు స‌మాచార హ‌క్కు చ‌ట్టం కింద తెలిపిన‌ట్లు యూత్ ఫ‌ర్ యాంటీ క‌ర‌ప్ష‌న్ సంస్థ పౌండ‌ర్ రాజేంద్ర ప‌ల్నాటి తెలిపారు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *