ఆనారోగ్యంగా ఉన్న కుక్క‌కు ఆప‌రేష‌న్ చేయ‌గా..

Share On

క‌రోనా వైర‌స్ కార‌ణంగా నిత్యం మాస్కులు వాడుతూ, వాడిన మాస్కుల‌ను ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ ఇష్టానుసారంగా పారేస్తున్నారు.. రోడ్డు మీద తిరిగే జంతువులు తిన‌డంతో అవి ఆనారోగ్యానికి గుర‌వుతున్నాయి. అలాంటిది తిరుపతి చింతలచేను ప్రాంతంలో 6 నెలల వయసున్న మగకుక్క 4 రోజుల నుంచి వాంతి చేసుకుంటూ అనారోగ్యంతో ఉండడంతో వీసీసీకి తీసుకొచ్చారు. శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ వర్సిటీలోని వెటర్నరీ క్లినికల్‌ కాంప్లెక్స్‌లో వైద్యులు బుధవారం అరుదైన ఆపరేషన్‌ చేసి కుక్క చిన్న ప్రేవుల్లో ఇరుకున్న మాస్క్‌ను తొలగించారు.

ఎక్స్‌రే తీసిన అనంతరం డాక్టర్‌ భారతి, డాక్టర్‌ రఘునాథ్, డాక్టర్‌ ఎన్,ధనలక్ష్మి శస్త్రచికిత్స చేసి మాస్కును తొలగించారు. ప్రజలు వినియోగించిన మాస్కులను ఎక్కడపడితే అక్కడ వేయడం వల్లే మూగజీవాలు ఇలాంటి సమస్యల్లో చిక్కుకుంటున్నాయని వైద్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *