గుండెపోటుకు ముందు ఈ ల‌క్ష‌ణాలు వ‌స్తూ ఉంటాయి..

Share On

మ‌నిషి చూస్తే చాలా ఆరోగ్యంగా ఉన్న‌ట్టే క‌న‌బ‌డుతారు.. కాని ఎప్పుడు ఏం జ‌రుగుతుందో మ‌నిషి ఎప్పుడు ఏలా క‌నుమ‌రుగ‌వుతున్నాడో అర్థం కావ‌డం లేదు.. ఈ మ‌ధ్య కాలంలో గుండెపోటులు చిన్న‌, పెద్దా అనే తేడా లేకుండా గుండెపోటు హ‌ఠాత్తుగా వ‌స్తూ ప్రాణాల‌ను తీసేసుకుంటుంది. అస‌లు గుండెపోటు వ‌చ్చేముందు ఏలాంటి ల‌క్ష‌ణాలు ఉంటాయో ఒక‌సారి తెలుసుకుందాం..

శీతాకాలంలో గుండెపోటు కేసులు గణనీయంగా పెరుగుతాయ్న విషయం తెలిసిందే. గుండెపోటుకు ప్రధాన లక్షణాలు ఛాతీ నొప్పి, తల తిరగడంతోపాటు శరీరం కొన్ని ఇతర చిన్న సంకేతాలను ఇస్తుంది. ప్రజలు వీటిని తరచుగా విస్మరిస్తూ.. ప్రమాదాన్ని మరింత పెంచుకుంటారు. ఈ లక్షణాలను సకాలంలో గుర్తిస్తే.. గుండెపోటు ప్రమాదాన్ని నివారించవచ్చంటున్నారు వైద్య నిపుణులు. గుండెపోటును సకాలంలో గుర్తించడం, దీంతోపాటు పలు అలవాట్లకు దూరంగా ఉంటే.. గుండెపోటు నివారించవచ్చని ప్ర‌ముఖ వైద్యులు చెపుతున్నారు. ఛాతీ నొప్పితో పాటు, శరీరంలోని ఇతర గుండెపోటు లక్షణాలు తేలికపాటి గుండెపోటుకు కారణమవుతాయి. సకాలంలో చికిత్స తీసుకోని వారికి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. దీని కోసం ఈ ఇతర లక్షణాలను కూడా గుర్తించడం అవసరం అంటున్నారు.

దవడ, ఎడమచేతి నొప్పి కూడా గుండెపోటు లక్షణమ‌ని దవడ వెనుక నొప్పిని తేలికగా తీసుకోకూడదు. ఏదో ఒక దంత సమస్య వల్ల ఇలా జరుగుతోందని చాలా సార్లు అనుకుంటారు. కానీ చాలా సందర్భాల్లో ఇది గుండెపోటుకు సంబంధించిన లక్షణమని తేలింది. సకాలంలో చికిత్స చేయకపోతే పరిస్థితి మరింత దిగజారుతుంది. ఇందులో దవడ నుంచి నొప్పి మొదలై మెడ వరకు వ్యాపిస్తుంది. ఈ లక్షణాలు వచ్చిన వెంటనే గుండె పరీక్షలన్నీ చేయించుకుంటే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. దీనితో చికిత్స కూడా సులభమని.. బాధితులను రక్షించవచ్చని పేర్కొన్నారు. కాసేపు నడిచిన తర్వాత లేదా కొన్ని మెట్లు ఎక్కిన తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ప్రారంభమైతే అది గుండెలో ఏదో సమస్య ఉన్నట్లు లక్షణం. ఇది మరింత ప్రమాదానికి దారితీయవచ్చు. శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలు పురుషులు, స్త్రీలలో కనిపిస్తాయి. ఇలాంటి సమస్య ఒకటి రెండు సార్లు వచ్చినా భయపడాల్సిన పనిలేదు. కానీ, ఈ సమస్య రెండు మూడు రోజులు కొనసాగితే మాత్రం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇది గుండెపోటు ప్రారంభ లక్షణం. కాబట్టి దానిపై శ్రద్ధ వహించాలి. పై ల‌క్ష‌ణాల‌పై ముందుగా మెల్కోంటే గుండెపోటు నుంచి ప్రాణాన్ని ర‌క్షించుకోవ‌చ్చ‌ని అంటున్నారు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *