ఆనంద‌య్య మందు పంపిణీతో క‌రోనా వ్యాపిస్తోంద‌ని..

Share On

క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కూడా మందు త‌మ ద‌గ్గ‌ర ఉంద‌ని చెప్ప‌డం, దేశ విదేశాల నుంచి కూడా వేలాదిగా త‌ర‌లిరావ‌డంతో ఆనంద‌య్య ఇంటిముందు ఆ గ్రామ ప్ర‌జ‌లు అందోళ‌న‌కు దిగారు. మందు పంపిణీ చేయోద్దంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గ్రామ‌స్థుల‌ను కాదని మందు పంపిణీ చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని ప్రజలు హెచ్చరిస్తున్నారు. ఆనందయ్య మెడిసిన్ కోసం ఇతర రాష్ట్రాల నుంచి వేలాదిమంది ఇక్కడికి రావడం వల్ల.. తమకూ కరోనా సోకుతుందని గ్రామస్తులు భయాందోళన వ్యక్తంచేస్తున్నారు. ఒమిక్రాన్‌కు మందు కనిపెట్టినట్టు.. అసత్య ప్రచారం చేస్తున్నారని ఆనందయ్యపై మండిపడుతున్నారు. గ్రామస్తుల ఆందోళనలతో ఆనందయ్య ఇంటి వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. గ్రామస్తులతో మాట్లాడి పరిస్థితి అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

మందు పంపిణీకి కోర్టు అనుమతి ఉందని ఆనందయ్య పేర్కొంటున్నారు. కరోనా నుంచి రక్షణ పొందేందుకు మందు కోసం చాలా మంది వస్తున్నారని అంటున్నారు. ప్రభుత్వం స్పందించి ఆందోళన చేసే వారిపై చర్యలు తీసుకోవాలంటున్నారు. ఆనందయ్య కరోనా మందుకు అనుమతులు లేవని ఆయుష్‌ శాఖ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయినా కరోనా బాధితులు తరలివస్తుండటంతో కృష్ణపట్నం వాసులకు ఇబ్బందులు తప్పడం లేదని పేర్కొంటున్నారు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *