ఇది ప్ర‌పంచంలోనే అత్యంత వేగంగా ఎగిరే ప‌క్షి..

Share On

ప్ర‌పంచంలో ఎన్నో ర‌కాల వింత జంతువులు, ప‌క్షులు, కీట‌కాలు ఉన్నాయి. అందులో ఒక్కోదానికి ఒక్కో ప్ర‌త్యేక‌త ఉంటుంది. ప‌క్షుల‌లో అత్యంత వేగంగా ఎగిరి ప‌క్షి ఒకటి ఉంది. ఆ పక్షి పేరు పెరెగ్రైన్ ఫాల్కన్. దీనిని డక్ హాక్ అని కూడా అంటారు. నేషనల్ జియోగ్రాఫిక్ ప్రకారం.. ఈ పక్షి గరిష్టంగా గంటకు 389 కి.మీటర్ల వేగంతో ఎగురుతుంది. ఈ పక్షి క్షణికావేశంలో వేటాడుతుంది.

ఈ పక్షి ఇంత వేగంగా ఎగరడానికి కారణం.. దాని రెక్కలు, ఎముకల నిర్మాణమే అంటున్నారు శాస్త్రవేత్తలు. దీని శరీరంలో ఉండే కీల్ ఎముక పెద్దదిగా ఉండడంతోపాటు దాని పొడవైన రెక్కలను వేగంగా కదిలిస్తుంది. ఈ పక్షి శరీరం బూడిద రంగులో ఉంటుంది. దీని శరీర పొడవు 36 నుంచి 49 సెం.మీటర్లు.

ఈ పక్షి వేగంగా ఎగురుతూనే వేటాడుతుంది. అంతేకాకుండా ఎగురుతూనే జంతువులు పట్టుకెళ్తుంది. చిన్న చిన్న బాతులు, పక్షులు, తీర పక్షులను వేటాడుతుంది. ఈ పక్షి ద్రువ ప్రాంతం మినహా దాదాపు అన్ని దేశాల్లో కనిపిస్తుంది. ఈ పక్షులలో ఆడ పక్షుల కంటే మగ పక్షుల శరీర పరిమాణం పెద్దదిగా ఉంటుంది. పుట్టిన ఒక సంవత్సరంలోనే ఈ పక్షి సంభోగానికి సిద్ధపడుతుంది. ప్రస్తుతం కాలంలో ఈ పక్షి క్రమంగా అంతరించి పోతుంది. ప్రస్తుతం ఈ పక్షి అరుదైన పక్షిగా మిగిలిపోయిందని నిపుణులు అంటున్నారు. ఇందుకు కారణం పురుగుల మందు వాడడం వలనే పక్షులు అంతరించిపోతున్నాయని తెలిపారు. వీటిని కాపాడేందుకు ఇప్పుడు శాస్త్రవేత్తలు కృషిచేస్తున్నారు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *