వామ‌ప‌క్ష తీవ్ర‌వాద అణిచివేత‌కు చేసిన ఖ‌ర్చెంత‌..

Share On

దేశంలో గ‌త ప‌ది సంవ‌త్స‌రాల నుంచి మావోయిస్టుల అణిచివేత‌కు, మావోయిస్టు ప్రాబ‌ల్యం ఉన్న ప్రాంతాల‌లోని యువ‌తి, యువ‌కుల అభివృద్ది కొర‌కు ఎంత ఖ‌ర్చు చేశార‌ని కేంద్ర ప్ర‌భుత్వాన్ని యూత్ ఫ‌ర్ యాంటీ క‌ర‌ప్ష‌న్ సంస్థ స‌మాచార హ‌క్కు చ‌ట్టం ద్వారా ప్ర‌శ్నించగా ప‌లు స‌మాచారం ఇచ్చిన‌ట్లు యూత్ ఫ‌ర్ యాంటీ క‌ర‌ప్ష‌న్ సంస్థ పౌండ‌ర్ రాజేంద్ర ప‌ల్నాటి తెలిపారు.

గ‌తంలో వెనుక‌బ‌డిన మారుమూల ప్రాంతాలు, ఏజెన్సీ గ్రామాల‌లో స‌రియైన అభివృద్ది జ‌ర‌గక‌పోవ‌డం వ‌ల‌న‌.. చాలా మంది అధికారులు మారుమూల గ్రామాల‌కు వెళ్ల‌క‌పోవ‌డం వల‌న చదువుకు దూర‌మైన ఎక్కువ‌మంది యువ‌తీ, యువ‌కులు వామ‌ప‌క్ష తీవ్ర‌వాదంపై ప్ర‌త్యేక దృష్టి సారించేవారు. టెక్నాల‌జీ మారుతున్న‌కొద్ది ప్ర‌భుత్వం ప్ర‌తి గ్రామంపై, అక్క‌డ ఉండే యువ‌త‌పై ప్ర‌త్యేక దృష్టి సారించి వారి అభివృద్ది కోసం పాటు ప‌డుతోంది. మావోయిస్టుల అణిచివేత‌కు గ‌త ప‌ది సంవ‌త్స‌రాల నుంచి దేశవ్యాప్తంగా ఎన్ని కోట్లు ఖ‌ర్చు చేశారు.. ఏఏ రాష్ట్రాల‌కు ఎన్ని నిధులు ఇచ్చారని యూత్ ఫ‌ర్ యాంటీ క‌ర‌ప్ష‌న్ సంస్థ ప్ర‌శ్నించ‌గా ప‌లు విష‌యాలు తెలియ‌జేశారు.

వామ‌ప‌క్ష తీవ్ర‌వాద నిర్మూల‌న‌కు కేంద్ర ప్ర‌భుత్వం 2008 నుంచి 2021 వ‌ర‌కు తొమ్మిది రాష్ట్రాల‌లో ప్రత్యేక మౌలికసదుపాయాల పథకం కింద.. తీవ్రవాదం ఉన్న ప్రాంతంలో పోలీస్ స్టేషన్ ను పటిష్టం చేయడం కొరకు 2008 నుంచి ప్రస్తుతం ఇప్పటివరకు 1354 కోట్లు ఖర్చు చేసినట్టు మినిస్ట్రీ ఆఫ్ హోం ఎఫైర్స్ డిప్యూటీ సెక్రటరీ నిశాంత్ కుమార్ మిశ్రా, యూత్ యాంటీ కరప్షన్ అడిగిన సమాచార దరఖాస్తుగాను సమాధానం తెలిపారు. ఇందులో 75 కోట్లు మీడియా ప్లాన్ స్కీమ్ కింద.. మరో 203 కోట్లు సివిక్ యాక్షన్ ప్రోగ్రాం కు గాను ఖర్చు చేసినట్లు వివరాలు వెల్లడించారు.

దేశంలోని రాష్ట్రాల వారీగా ఖ‌ర్చుల వివ‌రాలు..

దేశంలోని మావోయిస్టుల అణిచివేత‌కు రాష్ట్రాల‌వారీగా కేంద్రం ఖ‌ర్చు చేసిన వివరాల ప్ర‌కారం ఆంధ్రప్రదేశ్ – 83 కోట్లు, బీహర్ – 236కోట్లు, చత్తీస్ గడ్ – 270కోట్లు, జార్ఘండ్ – 257కోట్లు, మధ్యప్రదేశ్ – 33కోట్లు, మహరాష్ట్ర – 46కోట్లు, ఒడిస్సా – 250కోట్లు, తెలంగాణ – 77కోట్లు, కేరళ – 90లక్షలు, ఉత్తరప్రదేశ్ – 52 కోట్లు, పశ్చిమబెంగాల్ – 48కోట్లు ఖ‌ర్చు చేసిన‌ట్లు యూత్ ఫ‌ర్ యాంటీ క‌రప్ష‌న్ స‌మాచార హ‌క్కు ద‌ర‌ఖాస్తుకు కేంద్రం తెలిపింద‌ని సంస్థ పౌండ‌ర్ రాజేంద్ర ప‌ల్నాటి తెలిపారు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *