ఆ వ్య‌క్తికి రెండు చేతులు లేవు.. కాని ఈత కొడుతాడు..

Share On

మ‌నిషికి క‌సి, ప‌ట్టుద‌ల ఉంటే ఏదైనా సాధించ‌వ‌చ్చు.. కొంత‌మంది ఎన్ని అడ్డంకులు ఉన్న అనుకున్న‌ది సాధిస్తారు. అలాంటిది ఒక వ్య‌క్తి రెండు చేతులు లేకున్నా, కాళ్ల‌ను తాళ్ల‌తో క‌ట్టేసి మ‌రీ ఈత కొడుతున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన శివయ్య అనే వ్యక్తి ఈతతో చేస్తున్న విన్యాసాలు చూస్తే ఎవరైనా ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే..

విశాఖ భీమిలి మండ‌లం బ‌స‌వ‌పాలెం గ్రామానికి చెందిన శివయ్య.. పుట్టుకతోనే పోలియో బాధితుడు. ఎడమచేయి పూర్తిగా లేదు, కుడిచేతికి రెండు వేళ్లు మాత్రమే. కానీ, ఉన్న రెండు కాళ్లకు తాడును క‌ట్టుకుని ఈత కొడుతూ అందరిని ఆశ్చర్యప‌రుస్తున్నాడు. 15 ఏళ్ల క్రితం శివ‌య్య ఒక‌ న‌దిలో స్నానానికి దిగిన స‌మ‌యంలో ఈత రాక‌పోయినా పైకి తేల‌డం గ్రహించాడు. అప్పటి నుండి నీళ్లపై తేలుతూ అంద‌రిని ఆశ్చర్యప‌రుస్తున్నాడు. దాంతో ఊరంతా శివ‌య్యకు ఏవో శ‌క్తులు ఉన్నాయ‌ని అనుకుంటున్నారు. ఆరేళ్ల క్రితం దాతల సాయంతో భీమిలి మండలం అన్నవరం–అమనాం పంచాయతీల మధ్య బసవపాలెంలో బసవేశ్వరుని పేరుతో శివాలయం నిర్మించాడు. ఇకపోతే తనకంటూ అయినవాళ్లు ఎవరూ లేని శివయ్య..ఆ శివుడి సేవలోనే గడుపుతున్నాడు.. ఏ మాత్రం చదువుకోని శివయ్య తాను నిర్మించిన ఆలయంలో స్వయంగా శివలింగానికి అష్టోత్తరాలు, పూజలు జరిపిస్తుంటాడు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *