ఫోన్ కూడా కాదు.. ఒకే ఒక్క మిస్ కాల్‌.. 46ల‌క్ష‌లు స్వాహా

Share On

ఈజీ మ‌నీ కోసం సైబ‌ర్ నేర‌గాళ్లు ఏలా రెచ్చిపోతున్నారో.. ఎవ‌రికి అంతుప‌ట్ట‌డం లేదు.. క‌ళ్లు మూసి తెరిచేలోపే అకౌంట్‌లో ఉన్న ల‌క్ష‌ల రూపాయ‌లు స్వాహా అవుతున్నాయి.. ఒక వ్య‌క్తికి ఫోన్ కూడా కాదు ఒక్క మిస్ కాల్ వ‌చ్చింది.. వెంట‌నే సిమ్ ప‌నిచేయ‌డం మానేశాయి.. కాసేప‌ట్లో ఫోన్ స్విచ్ఛాప్ అయింది.. తెరుకునేలోపు ఆ వ్య‌క్తి అకౌంట్లో ఉన్న 46ల‌క్ష‌ల రూపాయ‌లు స్వాహా అయ్యాయి.

అహ్మాదాబాద్ శాటిలైట్ ఎక్స్‌టెన్షన్‌లో నివాసం ఉండే రాకేష్‌ షా కెమికల్‌ బిజినెస్‌ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇంట్లో ఉన్న రాకేష్‌కు గుర్తు తెలియని నెంబర్‌ నుంచి మిస్డ్ కాల్ వచ్చింది. మిస్డ్‌ కాల్‌ వచ్చిన తర్వాత మొబైల్‌లో సిగ్నల్‌ లేకపోవడం, సిమ్‌ కార్డులు బ్లాక్‌ అయ్యాయి. దీంతో తన సిమ్‌ కార్డులు పనిచేయడం లేదని సదరు టెలికాం నెట్‌వర్క్‌కు చెందిన కస్టమర్‌ కేర్‌కి కాల్‌ చేశాడు. రాకేష్‌ ఫిర్యాదుతో నిర్వాహకులు నాలుగు గంటల్లో సిమ్‌లు యాక్టివేట్‌ అవుతాయని చెప్పారు. సరిగ్గా అదే రోజు రాత్రి 10 గంటల సమయంలో మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యిందని మరోసారి కంపెనీకి ఫిర్యాదు చేశాడు. మరుసటి రోజు ఉదయం సిమ్‌ను యాక్టివేట్ చేసే సమయంలో మళ్లీ రెండు సిమ్‌ కార్డ్‌లు బ్లాక్‌ అయినట్లు గుర్తించాడు.

వెంటనే సంబంధిత సిమ్‌ నెట్‌ వర్క్‌కు సంబంధించిన స్టోర్‌ నిర్వాహకుల్ని నేరుగా సంప్రదించాడు. రాకేష్‌ ఫోన్‌ను చెక్‌ చేసిన స్టోర్‌ ప్రతినిధులు కోల్‌కతాలో రెండు సిమ్‌ కార్డ్‌లను బ్లాక్‌ చేసినట్లు గుర్తించారు. అంతేకాదు తనకు తెలియకుండా బ్యాంక్‌ ట్రాన్సాక్షన్లు జరిగినట్లు అనుమానించాడు. సంబంధిత బ్యాంక్‌లను సంపద్రించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సైబర్‌ నేరస్తులు తన బ్యాంక్ అకౌంట్‌లో ఉన్న రూ.46 లక్షలు కాజేశారని కంగుతిన్నాడు. ఆర్టీజీఎస్‌, ఐఎంపీఎస్‌ ద్వారా సోనాయ్ దాస్, రోహిత్ రాయ్, రాకేష్ విశ్వకర్మ బ్యాంక్‌ అకౌంట్‌లకు ట్రాన్స్‌ఫర్‌ అయినట్లు బ్యాంక్‌ అధికారులు నిర్ధారించారు. దీంతో అప్రమత్తమైన రాకేషన్‌ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 11 ట్రాన్సాక్షన్‌ల ద్వారా రూ.46.36 లక్షలు విత్‌డ్రా అయ్యాయని, బ్యాంకింగ్ లావాదేవీలకు సంబంధించిన ఓటీపీలను సేకరించడం ద్వారా బ్యాంక్‌లో డబ్బులు మాయమైనట్లు పోలీసులు తెలిపారు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *