వ‌న‌మా రాఘ‌వ‌కు 14రోజులు క‌స్ట‌డీ.. భ‌ద్రాచ‌లం జైలు త‌ర‌లింపు

Share On

పాల్వంచ రామకృష్ణ కుటుంబం బలైన కేసులో ఏ2గా ఉన్న వనమా రాఘవకు కోర్టు 14 రోజుల కస్టడీ విధించింది. శుక్రవారం రాత్రి పోలీసులు రాఘవను అదుపులోకి తీసుకున్నారు. శనివారం ఉదయం వైద్యపరీక్షల అనంతరం పాల్వంచ పోలీసులు.. రాఘవను కొత్తగూడెం జిల్లా జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. విచారించిన మెజిస్ట్రేట్.. రాఘవకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు. దాంతో రాఘవను పోలీసులు భద్రాచలం సబ్ జైలుకు తరలించారు. వనమా రాఘవను కోర్టులో ప్రవేశపెట్టడానికి పాల్వంచ పోలీస్ స్టేషన్ నుంచి తీసుకెళ్తుండగా బీజేపీ శ్రేణులు అడ్డుకున్నాయి. రాఘవ కేసును సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.

భ‌ద్రాచ‌లం జైల్లో రాఘవకు రిమాండ్‌ ఖైదీ నెం.985 సంఖ్యను కేటాయించారు. ప్రత్యేక సబ్‌జైల్లోని బ్యారక్‌ నెం.1లో అతడిని ఉంచారు. వాస్తవానికి రాఘవను ఖమ్మం జిల్లా జైలుకు తరలించాల్సి ఉండగా ప్రత్యేక పరిస్థితుల నేపధ్యంలో అతడిని భద్రాచలం ప్రత్యేక సబ్‌జైలుకు తరలించినట్లు తెలుస్తోంది. త్వరలో మళ్లీ అతడిని ఖమ్మం జైలుకు తరలిస్తారని ప్రచారం జరుగుతోంది.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *