క్లాత్ మాస్క్‌ల‌తో క‌రోనాను నివారించ‌డం క‌ష్ట‌మంట‌..

Share On

క‌రోనా ఒమిక్రాన్ వైర‌స్ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది.. వైర‌స్‌ను అడ్డుకోవాలంటే వ్యాక్సిన్ల‌తో పాటు మాస్క్‌లు, భౌతిక‌దూరం వంటి నిబంధ‌న‌లు త‌ప్ప‌నిస‌రిగా పాటించాల‌ని ప్ర‌భుత్వాల‌తో పాటు వైద్య‌నిపుణులు చెపుతున్నారు. కాని మాస్కుల‌లో ఏలాంటి మాస్కులు వాడాల‌ని మాత్రం చాలా మందికి అర్థం కావ‌డం లేదు.

కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ అత్యంత వేగంగా వ్యాపిస్తుండటంతో సింగిల్‌ లేయర్‌ మాస్క్‌లను వాడకపోవడమే మేలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వీటి వల్ల కేవలం 20 నిమిషాల్లోనే వైరస్‌ సోకే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మాస్క్‌ల వినియోగంపై అమెరికన్‌ కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ గవర్నమెంటల్‌ ఇండస్ట్రియల్‌ హైజీనిస్ట్‌తో పాటు సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) పలు అధ్యయనాలు చేపట్టింది. ఒకవేళ ఇద్దరు వ్యక్తులు మాస్క్‌లు ధరించకుండా ఆరు అడుగుల దూరంలో నిలబడితే.. అందులో ఒక‌ వ్యక్తికి కొవిడ్‌ పాజిటివ్‌ ఉంటే.. అప్పుడు కేవలం 15 నిమిషాల్లోనే వైరస్‌ సోకుతుంది. ఒకవేళ ఇద్దరిలో కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన వ్యక్తికి మాస్క్‌ లేకుండా.. అవతలి వ్యక్తి క్లాత్‌ మాస్క్ ధరించినట్లయితే.. అప్పుడు వైరస్‌ 20 నిమిషాల్లో సోకుతుంది.

ఇద్దరూ క్లాత్‌ మాస్క్‌లు ధరిస్తే గనుక.. 27 నిమిషాల్లో వైరస్‌ వ్యాపిస్తుంది. ఒకవేళ ఇద్దరిలో కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన వ్యక్తికి మాస్క్‌ లేకుండా.. అవతలి వ్యక్తి కేవలం సర్జికల్‌ మాస్క్ ధరించినట్లయితే.. అప్పుడు వైరస్‌ 30 నిమిషాల్లో మరో వ్యక్తికి సోకుతుంది. అదే ఇద్దరిలో ఒకరు ఎన్‌95 మాస్క్‌ ధరించి.. మరో వ్యక్తి పూర్తిగా మాస్క్‌ పెట్టుకోకపోతే కనీసం 2.5 గంటల్లో వైరస్‌ వ్యాపిస్తుంది. ఇద్దరూ ఎన్‌95 మాస్క్‌లు ధరిస్తే.. వైరస్‌ వ్యాప్తి చెందడానికి కనీసం 25 గంటల సమయం పడుతుందని అధ్యయనంలో తేలింది. సింగిల్‌ లేయర్‌ క్లాత్ మాస్క్‌లు వైరస్‌లను మోసుకెళ్లే పెద్ద పెద్ద తుంపరలను అడ్డుకోగలవుగానీ, చిన్న చిన్న ఏరోసెల్స్‌ను బ్లాక్‌ చేయడంలో సమర్థంగా పనిచేయవని అధ్యయనం తెలిపింది. ధ్రువీకరించిన ఎన్‌95 మాస్క్‌లు మాత్రం గాలిలోని 95 శాతం అణువులను వడబోయగలవని పేర్కొంది. రెండు లేదా మూడు డోస్‌ల టీకా వేసుకున్నా ఒమిక్రాన్ వేరియంట్ వదలిపెట్టడం లేదు. ఈ నేపథ్యంలో టీకా తీసుకున్నా తప్పనిసరిగా మాస్క్ ధరించడం వల్ల కరోనా వ్యాప్తిని అడ్డుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *